Banana: సాధారణంగా చాలామంది కొన్ని రకాల ఆహార పదార్థాలను కలిపి తినడానికి ఎంతో ఇష్టత చూపుతూ ఉంటారు. ఇలా కొన్నిసార్లు ఇలాంటి ఆహార పదార్థాలను కలిపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలాంటి వాటిలో అరటి పండు అలాగే పాలు కలిపి తినడం కూడా ఒకటని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చాలామంది అరటిపండు పాలు కలుపుకొని తినడానికి ఇష్టపడుతుంటారు అలాగే మరికొందరు అరటిపండు తిన్న వెంటనే పాలు తాగడం లేదా పాలు తాగిన వెంటనే అరటి పండు తినడం చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యంపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ విధంగా అరటిపండు పాలు వెంట వెంటనే తీసుకోకూడదని ఈ రెండిటిని తీసుకోవడానికి కనీసం ఒక గంట వ్యవధి అయినా ఉండాలి అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇక చాలామంది పెరుగన్నంలోకి అరటిపండు తింటూ ఉంటారు ఇది కూడా మంచిది కాదు.
ఇక సలాడ్స్ లో కూడా పాలు పెరుగు అరటిపండు కలిపి చేస్తూ ఉంటారు. ఇది తినడం కూడా ఆరోగ్యం పై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూనే ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు పాలు అరటిపండును కలిపి తినడం వల్ల వారికి ఆస్తమా వంటి శ్వాస కోసం సంబంధిత వ్యాధులు మరింత ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే వాంతులు, విరేచనాలు వంటివి కూడా కావొచ్చు. గుండె జబ్బులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. రాత్రుళ్లు నిద్రపట్టక ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది. అందుకే ఎప్పుడూ కూడా అరటిపండు పాలను కలిపి తినకూడదు.