Devotional Facts: సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎన్నో కష్టాలు ఉంటాయి అనేది సర్వసాధారణంగా జరిగే విషయమే ప్రతి ఒక్కరు కూడా ఏదో రకమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతుంటారు కానీ చాలా మందికి మాత్రం ఒక ఇబ్బంది తొలగిపోయిన తర్వాత మరొక ఇబ్బంది వస్తూనే ఉంటుంది. ఇలాంటివారు అధికంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు. ఇలా ఒకటి తర్వాత మరొకటి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నటువంటి వారు ఎన్నో రకాల ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. ఇలాంటి ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు శుక్రవారము ఇలాంటి పరిహారాలను పాటిస్తే చాలు..
ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు శుక్రవారం రోజున ఇంట్లో ఉన్నటువంటి మహిళలను ఆడపిల్లల పట్ల ఎప్పుడూ కూడా దురుసుగా మాట్లాడకూడదు వారిని అసభ్యకర పదజాలంతో మాట్లాడటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండదు. మహిళలు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమని చెబుతూ ఉంటారు. అందుకే స్త్రీలను అవమానించిన చోట లక్ష్మీదేవి ఉండదు. ఇక శుక్రవారం ఇతరుల పట్ల ఎప్పుడు కూడా ఆగ్రహం వ్యక్తం చేయకుండా చాలా శాంతంగా ఉండాలి.
శుక్రవారం ఎవ్వరికి అప్పు ఇవ్వకూడదు అదేవిధంగా ఎవరికైనా డబ్బు చెల్లించాల్సి ఉన్నా కూడా శుక్రవారం ఇవ్వకపోవడం ఎంతో మంచిదే. ఇక శుక్రవారం చక్కెరను కనక పొరపాటున దానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండదని తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఇలా చక్కెరతో పాటు ఉప్పును కూడా ఎవరికి శుక్రవారం దానం ఇవ్వకూడదు.