Health Tips: ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లకు అనుగుణంగా చాలామంది అతి చిన్న వయసులోనే అధిక శరీర బరువుతో బాధపడుతూ ఉంటారు. ఇలా అధిక శరీర బరువుతో బాధపడేవారు బరువు తగ్గడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు చాలామంది జిమ్ వర్కౌట్స్ చేస్తూ ఉండగా మరికొందరు కఠినమైనటువంటి డైట్ ఫాలో అవుతూ ఉంటారు అయితే ఇలాంటి కఠినతరమైనటువంటి డైట్ ఫాలో కాకుండా కేవలం సింపుల్ జ్యూస్ ద్వారా అధిక శరీర బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు.

అధిక శరీర బరువుతో బాధపడేవారు చిటికెడు పసుపును గోరువెచ్చని నీళ్లు లేదా పాలలో కలుపుకొని తాగటం వల్ల అందులో ఉన్నటువంటి యాంటీబయోటిక్స్ యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి రోగనిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా మన శరీరంలో పేరుకుపోయినటువంటి అధిక కొవ్వును కరిగించడంలో కూడా ఎంతో దోహదం చేస్తుంది. ప్రతిరోజు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు తాగటం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు కలగడమే కాకుండా శరీర బరువు తగ్గవచ్చు.
ఇకపోతే త్రిఫల చూర్ణం తీసుకోవడం వల్ల కూడా ఈ శరీర బరువు తగ్గటానికి ఎంతగానో దోహదం చేస్తుంది. వీటితో పాటు దాల్చిన చెక్క టీ తయారుచేసుకుని తాగటం వల్ల ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ మొత్తాన్ని కరిగించి శరీర బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. ఇలా ఈ జ్యూస్ తాగుతూనే కొంత సమయం పాటు వాకింగ్ చేయడం లేదా వ్యాయామం వంటి వాటి ద్వారా కూడా మనం శరీరం బరువు తగ్గించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.