Tue. Jan 20th, 2026

    Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ కి సౌత్ ఇండియాలో అదిరిపోయే ఇమేజ్ ఉంది. తమిళనాడులో అయితే ఏకంగా దేవుడిలా కొలుస్తారు. వేల కోట్ల రూపాయిలు నటుడిగా సంపాదించిన ఇప్పటికి సింపుల్ గానే ఉండే వ్యక్తి. అతని వ్యక్తిత్వం గురించి ప్రతి ఒక్కరు గొప్పగా చెబుతారు. సౌత్ లో వ్యక్తిత్వం పరంగా ఎవరూ అందుకోలేని ఎత్తులో రజినీకాంత్ ఉంటారని చాలా మంది కొనియాడుతూ ఉంటారు. 80 ఏళ్ళ వయస్సులో కూడా కుర్రాళ్ళతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు. అయితే ఎలాంటి వారిపైన అయిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడం పరిపాటిగా మారిందనే టాక్ రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది.

    Rajinikanth YS Jagan | తెలుగు360

    వైసీపీ వాళ్ళు టార్గెట్ చేసారంటే జగన్ ని ఏమైనా రజినీకాంత్ విమర్శలు చేసారా అనే అనుమానం ఎవరికైనా రావొచ్చు. అలాంటిదేం లేదు. కేవలం చంద్రబాబుని పోగాడటమే సూపర్ స్టార్ చేసిన తప్పైంది. ఎన్టీఅర్ శత జయంతి ఉత్సవాలలో సూపర్ స్టార్ రజినీకాంత్ వచ్చి చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. ఇది ఆయా పార్టీల సభలలో కామన్ గా జరుగుతుంది. కాని చంద్రబాబుని పొగడటం రజినీకాంత్ చేసిన తప్పంని వైసీపీ మంత్రులు, నాయకుల అభిప్రాయం. అందుకే రజినీకాంత్ ఎవరనేది పట్టించుకోకుండా అధిష్టానం ఆదేశించింది. ఇక అందరూ బూతులతో రెచ్చిపోయారు.

    YSRCPAlogizeRAJINI Trending..Sandhi? Are you ready? Where is your capital?  Rajini fans trolling Jagan | Rajinikanth fans trolling YS Jagan:  YSRCPAlogizeRAJINI hash tag trending

    నువ్వు ముసలోడివి, విలువలు లేవు, నీతి లేదు. వెన్ను పోటు పొడవడంలో నువ్వు సహకరించావ్. నీ బ్రతుకెంత. తమిళనాడుకె నువ్వు సూపర్ స్టార్ వి. మాకు జీరోవి. ఇలా ఇష్టారీతిలో నోటికొచ్చిన ప్రతి పదం వాడేసి రెచ్చిపోయారు. అయితే ఈ విషయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ అస్సలు రియాక్ట్ కాలేదు. ఇలాంటివి అతని జీవితంలో చాలా సార్లు విని ఉంటారు. అయితే రజినీకాంత్ మీద ఈ స్థాయిలో వైసీపీ నేతలు మాటల దాడి చేస్తూ ఉంటే ఎవరూ ఖండించకపోవడం విశేషం. ఇక చంద్రబాబు నాయుడు దీనిని తీవ్రంగా ఖండించారు. మొత్తానికి తమని విమర్శిస్తేనే కాదు ప్రత్యర్ధిని పొగిడిన కూడా మేము టార్గెట్ చేస్తాం అనే విధంగా ఏపీలో వైసీపీ వ్యవహారం ఉందనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది.