YSRCP: జగన్ యూ-టర్న్.. ఢిల్లీ పెద్దలకి రాంరాం..!

YSRCP: నిన్నటివరకు కేంద్రంలోని బీజేపీ పెద్దలతో ‘ఫ్రెండ్లీ’గా ఉంటూ, తెరవెనుక స్నేహాన్ని నడిపిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఇప్పుడు రూట్ మార్చారు. ఢిల్లీ పాలకులకు ముఖం మీదే రాంరాం చెప్పేస్తూ.. పక్కా యాంటీ-బీజేపీ నరేటివ్‌ను తెరపైకి తెచ్చారు. ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత సైలెంట్‌గా ఉన్న జగన్, ఒక్కసారిగా గేర్ మార్చడం వెనుక బలమైన పొలిటికల్ మైండ్ గేమ్‌ ఉందనేది తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది.

ఇన్నాళ్లూ కేంద్ర పెద్దలపై నేరుగా విమర్శలు చేయడానికి వెనుకాడిన జగన్, ఇప్పుడు ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర హోం శాఖలనే బోనులో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (SIR)పై ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలే దీనికి నిదర్శనం. ఇటీవ‌ల బెంగాల్‌లో బీజేపీ విజయం వెనుక ఈ ప్రక్రియే ఉందంటూ ఆయన చేసిన విశ్లేషణ, జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం ఒక స్థానిక విమర్శ మాత్రమే కాదు.. ఢిల్లీ పీఠంపై జగన్ గురిపెట్టిన బాణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటు రాష్ట్రంలో పెట్రో ధరలపై నిరసనలు చేస్తూనే, అటు జాతీయ సంస్థల విశ్వసనీయతను ప్రశ్నించడం వెనుక పక్కా వ్యూహం కనిపిస్తోంది.

ysrcp-jagans-u-turn-ram-ram-to-delhi-elders

YSRCP: జగన్ ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో రాయబారాలు

రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. జగన్ ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో రాయబారాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ వేదికగా కొన్ని సీక్రెట్ మీటింగ్స్ కూడా జరిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పొరుగు రాష్ట్రం తమిళనాడులో నటుడు విజయ్ రాజకీయ ఎంట్రీతో దక్షిణ భారత పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. ఈ మారుతున్న కాలానికి అనుగుణంగా, సౌత్‌లో బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ శక్తులను ఏకం చేయాలనే ఆలోచనలో వైసీపీ ఉన్నట్లు టాక్. తమిళనాడు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్‌తో చేతులు కలిపితే.. ఇటు జాతీయ స్థాయిలో రక్షణ, అటు రాష్ట్రంలో కోల్పోయిన పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకోవచ్చనేది జగన్ ప్లాన్ కావచ్చు.

ఇక జగన్ హఠాత్తుగా ప్లేట్ తిప్పేయడంతో బీజేపీ అధిష్ఠానం కూడా అప్రమత్తమైంది. ఇన్నాళ్లూ జగన్‌పై ప్రదర్శించిన సాఫ్ట్ కార్నర్‌ను పక్కనబెట్టి, వ్యూహాత్మకంగా చెక్ పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఒకవైపు లోకల్ కేడర్‌లో జోష్ నింపడానికి బీజేపీని విలన్ గా చూపించడం.. మరోవైపు జాతీయ స్థాయిలో ఇండియా బ్లాక్ వైపు అడుగులు వేయడం.. ఇలా జగన్ ఆడుతున్న డబుల్ గేమ్ పై ఢిల్లీ పెద్దలు సీరియస్‌గా ఉన్నట్లు భోగట్టా.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

12 hours ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

14 hours ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

3 weeks ago

This website uses cookies.