Hyderabad: రూ.1000 కోట్ల భూదందా.. అడ్డంగా బుక్కైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే!

Hyderabad: హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతంగా గుర్తింపు పొందిన గండిపేటలో ఓ భారీ భూకుంభకోణం వెలుగుచూసింది. ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని నకిలీ పత్రాలతో కొట్టేసేందుకు జరిగిన ఓ హైడ్రామాను పోలీసులు బట్టబయలు చేశారు. ఈ మెగా స్కామ్‌ వెనుక ఏపీకి చెందిన అధికార పక్ష మాజీ ఎమ్మెల్యే, ఆయన అనుచరుల హస్తం ఉన్నట్లు తేలడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది.

గండిపేట పరిధిలోని సర్వే నంబర్ 18లో ఉన్న విలువైన ప్రభుత్వ భూమిని టార్గెట్ చేసిన సదరు ముఠా, గత ప్రభుత్వ హయాంలోనే దీనికి స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వమే ఈ భూమిని తమకు కేటాయించిందంటూ కొన్ని నకిలీ జీవోలను సృష్టించారు. చట్టబద్ధంగా ఎలాంటి హక్కులు లేకపోయినా, ఈ ఫోర్జరీ పత్రాల ఆధారంగా ఆ భూమిని తమ పేరిట మార్చేసుకుని, ఆపై ఎకరా రూ.3.5 కోట్ల చొప్పున ఇతరులకు విక్రయించి భారీగా సొమ్ము చేసుకోవాలని ప్లాన్ చేశారు.

hyderabad-rs-1000-crore-land-scam-former-ysrcp-mla-booked

Hyderabad: అక్రమ డీల్ కోసం దాదాపు 4 కోట్ల రూపాయలు

అనుకున్న ప్లాన్ ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. అయితే, ఈ వ్యవహారంలో ఏదో తేడా కొడుతోందని గండిపేట తహసీల్దార్ అనుమానించారు. సదరు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించగా అవి నకిలీవని తేలింది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా తహసీల్దార్ రిజిస్ట్రేషన్‌ను నిలిపివేసి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వెయ్యి కోట్ల దందా గుట్టు రట్టయింది.

ఈ కేసుపై శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి. ఈ ల్యాండ్ స్కామ్ వెనుక పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఆయన సోదరుడు రమేశ్‌తో పాటు మరికొందరు ఉన్నట్లు గుర్తించారు. ఈ అక్రమ డీల్ కోసం దాదాపు 4 కోట్ల రూపాయలు చేతులు మారాయని, ఆ నగదు స్వయంగా మాజీ ఎమ్మెల్యే బ్యాంక్ ఖాతా నుంచే రెండు విడతలుగా బదిలీ అయినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి.

నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో, అరెస్ట్ భయంతో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆయన సోదరుడు పరారయ్యారు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మద్యం, ఇసుక, మైనింగ్ అక్రమాలపై ఇప్పటికే విచారణలు ఎదుర్కొంటున్న సదరు పార్టీకి, ఈ రూ. 1000 కోట్ల హైదరాబాద్ భూదందా వ్యవహారం మరింత తలనొప్పిగా మారేలా కనిపిస్తోంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

3 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

3 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

3 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

3 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

3 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

4 weeks ago

This website uses cookies.