YS Jagan: ఏపీ రాజకీయాలలో ఇప్పుడు వైసీపీ, టీడీపీ మధ్యనే ప్రధాన రాజకీయ పోరు నడుస్తోంది. జనసేన బలం ఉన్న కూడా ఒంటరిగా నిలబడే శక్తి లేదు. దీంతో టీడీపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకి వెళ్లాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. బీజేపీని కూడా తమ వైపుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇలా పొత్తులతో అందరిని ఏకం చేయడం ఇప్పుడు వైసీపీని టెన్షన్ పెడుతోంది. మూడు పార్టీలు మళ్ళీ కలిసి పోటీ చేస్తే 2014 సీన్ రిపీట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. ఇక టీడీపీ కూడా అదే ధీమాతో ఉంది. సంక్షేమ పథకాలు అమలు చేస్తోన్న ప్రజా వ్యతిరేకత అయితే వైసీపీ మీద తీవ్ర స్థాయిలో ఉందనేది రాజకీయ వర్గాలలో వినిపిస్తోన్న మాట.
అయితే టీడీపీ, జనసేన పొత్తుని ముఖ్యమంత్రి జగన్ అస్సలు అంగీకరించలేకపోతున్నారు. వారిని విడగొట్టడం సాధ్యం కాకపోవడంతో ఇప్పుడు ఆ కూటమి వైపు ప్రజలు ప్రభావితం కాకుండా చూడాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ఆలోచన భాగానే ఉన్నా కూడా ముఖ్యమంత్రి జగన్ నెలకి మూడు, నాలుగు ఏదో ఒక పథకం పేరుతో మీటింగ్ లు పెట్టి జనసేన, టీడీపీపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. దుష్టశక్తులు అన్ని కలుస్తున్నాయి. తనని ఓడించడానికి అందరూ ఏకం అవుతున్నారు అంటూ పదే పదే చెబుతున్నారు.
ఈ విమర్శల ద్వారా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న అందరిని కూటమి వైపు మొగ్గేలా ముఖ్యమంత్రి జగన్ చేస్తున్నారనే మాట వినిపిస్తోంది. అసలు టీడీపీ, జనసేన కలిసి పోరాటాలు చేయకుండానే ముఖ్యమంత్రి జగన్ వారికి కావాల్సినంత ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. ఇలా చేసిన విమర్శలనే మళ్ళీ మళ్ళీ చేస్తే అవి కాస్తా జగన్ కి రివర్స్ అవ్వడమే కాకుండా టీడీపీ, జనసేనపై ప్రజాక్షేత్రంలో ప్రజలకి నమ్మకం పెంచే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఒక వేళ వచ్చే ఎన్నికలలో జగన్ ఓడిపోతే కచ్చితంగా అది వైసీపీ స్వయంకృతం కూడా అవుతుందని అంచనా వేస్తున్నారు.
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.