White Onion: ప్రస్తుత కాలంలో ఉల్లిపాయలు లేనిదే ఏ ఆహారం తయారు చేయరు. ఉల్లిపాయను కేవలం ఆహార పదార్థాలను రుచిగా మార్చడమే కాకుండా దాని ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అదేవిధంగా ఉల్లిపాయలను ఎక్కువగా సలాడ్ కోసం ఉపయోగిస్తూ ఉంటారు. ఈ విధంగా ఉల్లిపాయలను అధికంగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను మనం పొందవచ్చు అయితే ఉల్లిపాయలు మనకు తెల్లని రంగులో కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.
ఇలా తెల్లని ఉల్లిపాయలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే మాత్రం అసలు వదిలిపెట్టరు. మరి తెల్ల ఉల్లిపాయల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయానికి వస్తే..ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ అనేది బలంగా ఏర్పడుతుంది. ఎందుకు అంటే దీనిలో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది.ఇది జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడుతుంది. అంతేకాక ఉల్లిపాయలో ఫ్రీ బయోటిక్ అనేది ఉంటుంది. ఇది పొట్టను ఆరోగ్యంగా ఉంచటంలో ఎంతో మేలు చేస్తుంది.
ఇక తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు తెల్ల ఉల్లిపాయలు జుట్టుకు రాయటం వల్ల తెల్ల జుట్టు సమస్య నుంచి బయటపడవచ్చు. తెల్ల ఉల్లిపాయలో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. ఇవి శరీరం నుండి చెడు కొలెస్ట్రాలను తొలగించడంలో కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇక కొలెస్ట్రాల్ సమస్యలు బాధపడేవారు ప్రతిరోజు ఈ తెల్ల ఉల్లిపాయను తినటం వల్ల కొలెస్ట్రాల్ సమస్యలు తగ్గిపోతుంది.తెల్ల ఉల్లిపాయను తీసుకోవటం వలన గుండె సంబంధించిన సమస్యల నుండి కూడా ఉపశమనం పొందుతారు. దీనిలో యాంటీ ఇన్ ఫ్లమెంటరీలు కూడా ఉన్నాయి.