Categories: EntertainmentLatest

Yash : జై హనుమాన్ లో యశ్? ఆ క్యారెక్టర్ కోసమేనా?

Yash : పాన్ ఇండియా సినిమాగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన హనుమాన్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ మూవీ రిలీజైన అన్ని భాషల్లో భారీ వసూళ్లను రాబట్టింది. సినిమా విడుదలై 30 రోజులు పూర్తైనా ఇప్పటికీ థియేటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ రాబడుతోంది. హనుమాన్ ఎఫెక్ట్ తో మిగతా ఫిల్మ్ మేకర్స్ కూడా ఇతిహాసాల ఆధారంగా మూవీస్ చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మూవీ హిట్ ను ఎంజాయ్ చేస్తూనే జై హనుమాన్ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్స్ చేస్తున్నాడు. ఈ మూవీ అనౌన్స్‎మెంట్ అయినప్పటి నుంచి రకరకాల వార్తలు నెట్టింట్లో ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా ప్రశాంత వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ప్రముఖ కన్నడ స్టార్ యష్ భాగం కాబోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. యశ్ హనుమంతుడి క్యారెక్టర్ ను పోషించబోతున్నాడన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హనుమంతుడిగా యష్ రెడీ అవుతున్నాడని కన్నడనాట టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలో తాజాగా జై హనుమాన్ టీమ్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.

yash-kgf-star-to-play-key-role-in-prasanth-varmas-jai-hanuman-movie

టాలీవుడ్ లోనే కాదు అన్ని సినీ ఇండస్ట్రీల్లో ప్రస్తుతం సినిమాటిక్ యూనివర్స్‌ల ట్రెండ్ నడుస్తోంది. లేటెస్ట్ గా యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా తన సొంత సినిమాటిక్ యూనివర్స్‌ను అనౌన్స్ చేశాడు. ఇప్పటికే ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన ఫస్ట్ మూవీ ‘హనుమాన్’ ఎలాంటి హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అందరి దృష్టి ప్రశాంత్ తీయబోయే రెండో మూవీ ‘జై హనుమాన్’ పై పడింది. ప్రశాంత్ కూడా తన మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే కన్నడ స్టార్ హీరో యశ్ జై హనుమాన్ లో కనిపించబోతున్నాడన్న వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. వాస్తవానికి ‘జై హనుమాన్’ అనౌన్స్ అయినప్పటి నుంచి రోజుకో స్టార్ పేరు తెరముందుకు వస్తోంది. ఈ సినిమా కథ పూర్తిగా హనుమంతుడి చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది. అయితే హానుమాన్ లో హీరో తేజ్ సజ్జా ఏ పాత్ర పోషించాడో జై హనుమాన్ లోనూ అదే ఉంటుందని సమాచారం. అయితే హనుమంతుడి పాత్ర ఎవరు పోషిస్తున్నారు అన్నదానిపై ఆసక్తి పెరిగింది.

yash-kgf-star-to-play-key-role-in-prasanth-varmas-jai-hanuman-movie

హనుమాన్ సినిమాలో అంజనేయుడి పాత్రను చిరు పోషిస్తారని అంతా అనుకున్నారు కానీ అది జరగలేదు. దీంతో జై హనుమాన్ లో అయినా హనుమంతుడి పాత్రను చిరంజీవి పోషిస్తారని టాక్ టాలీవుడ్ లో వినిపించింది. అయితే ఇంతలోనే ఆ క్యారెక్టర్ లో యశ్ కనిపిస్తాడని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇది కూడా రూమర్ అని తెలుస్తోంది. అలాంటి పాత్ర చేయడానికి యశ్ రెడీగా లేడని ఆయన సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తన ఫోకస్ అంతా అప్‌కమింగ్ మూవీ ‘టాక్సిక్’పైనే ఉందని తెలుస్తోంది.

Sri Aruna Sri

Recent Posts

Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్..దర్శకుడెవరంటే!

Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…

2 days ago

Mythri Movie Makers: మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఇన్ని సినిమాలా? ఇండస్ట్రీలో వీళ్ళేగా నంబర్ 1!

Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో…

6 days ago

Vishwambhara: జరిగిన పొరపాటును మేకర్స్ ఒప్పుకున్నారా!

Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ…

1 week ago

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్..సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్ చేసిన చిరంజీవి

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ పుట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్…

1 week ago

Chiranjeevi: కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ కామెంట్స్ వైరల్.!

Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ…

2 weeks ago

Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా ‘పెద్ది’..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది!

Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా 'పెద్ది'..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది..అవును మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్…

2 weeks ago

This website uses cookies.