YSRCP: ఏపీలో అధికార పార్టీ వైసిపి వచ్చే ఎన్నికలే లక్ష్యంగా తమ రాజకీయ ప్రచార కార్యక్రమాలను ఇప్పటికే మొదలు పెట్టింది. వివిధ మార్గాల ద్వారా విస్తృతంగా ఎమ్మెల్యేలను, నాయకులను ప్రజల్లోకి పంపించి విస్తృతంగా సంక్షేమ పథకాలతో ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే టార్గెట్ 175 అంటూ ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా పెట్టుకుని నాయకులకి దిశా నిర్దేశం చేస్తూ రాజకీయ వ్యూహాలతో కార్యాచరణలు సిద్ధం చేస్తున్నారు. సంక్షేమ పథకాలే వచ్చే ఎన్నికలలో తమను అధికారంలోకి తీసుకువస్తాయని ముఖ్యమంత్రి జగన్ అంచనా వేస్తున్నారు.
ప్రతి ఇంట్లో మహిళలు ఏదో ఒక విధంగా సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతూ ఉండడం అధికార పార్టీ వైసీపీకి సానుకూలమైన అంశంగా ఉంది. డబ్బులు తీసుకుంటున్న మహిళలు కచ్చితంగా కృతజ్ఞత చూపిస్తారని జగన్ అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే పొలిటికల్ సర్వే సంస్థలు, మీడియా సంస్థలు ఎప్పటికప్పుడు దేశంలోని రాష్ట్రంలోని రాజకీయ వాతావరణాన్ని అంచనా వేసే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా జాతీయస్థాయిలో ఓ ఛానల్ నిర్వహించిన సర్వేలు ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసిపి అధికారంలోకి వస్తుందని అంచనా వేశారు.
ముఖ్యంగా ఏపీలో లోక్ సభ స్థానాలలో 25కి 24 వైయస్సార్సీపి గెలుచుకుంటుందని చెప్పడం విశేషం. ఇక ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఒకటి రెండు స్థానాలలో మాత్రమే ఎంపీ అభ్యర్థులను గెలిపించుకునే ఛాన్స్ ఉందని సదరు సర్వేలో పేర్కొన్నారు. అలాగే దేశంలో మరల బిజెపి అధికారంలోకి వస్తుందని భారీ మెజారిటీతో లోక్ సభ స్థానాలను గెలుచుకుంటుంది అని సదరు సర్వేలో చెప్పడం విశేషం. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే 104 లోక్ సభ స్థానాల వరకు గెలుచుకునే ఛాన్స్ ఉందని అంచనా వేశారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.