Wed. Jan 21st, 2026

    Nayanthara : పెళ్ళి తర్వాత నయనతార బికినీ వేస్తే ఛీ కొడతారా..? అనేది ఇప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలలో హాట్ టాపిక్‌గా మారింది. సౌత్ సినిమా ఇండస్ట్రీలలో నయనతార స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. ఇటు తెలుగులో అటు తమిళంలో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నయన హీరోయిన్‌గా నటించడమే కాక లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కొన్ని ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ అంటే దర్శక నిర్మాతల ఫస్ట్ ఛాయిస్ నయనతార.

    అయితే, ఇటీవల నయనతార సినిమాలను కాస్త తగ్గించింది. చాలా సెలెక్టెడ్‌గా కమిటవుతోంది. దీనికి కారణం పెళ్ళి చేసుకోవడమే. గత ఏడాది విఘ్నేష్ శివన్‌ను పెళ్ళి చేసుకున్న నయనతార ఆ తర్వాత ఒప్పుకుంటున్న సినిమాలను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటోంది. కథలో ఏమాత్రం సందేహాలున్నా నిర్మొహమాటంగా నో అంటోంది. ప్రస్తుతం నయన్ ఒప్పుకున్న సినిమాలలో బాలీవుడ్ చిత్రం జవాన్ కూడా ఉంది. ఈ సినిమాకి దర్శకుడు అట్లీ. ప్రియమణి కూడా ఇందులో కీలక పాత్రను పోషిస్తోంది.

    will-nayanthara-wear-a-bikini-after-marriage
    will-nayanthara-wear-a-bikini-after-marriage

    Nayanthara : కథ ప్రకారం ఇందులో నయన్ బికినీ ధరించాల్సి ఉందట.

    అయితే, కథ ప్రకారం ఇందులో నయన్ బికినీ ధరించాల్సి ఉందట. గతంలో అమ్మడు గ్లామర్ ట్రీట్ బాగానే ఇచ్చింది. తమిళంలో అజిత్ నటించిన బిల్లా మూవీలో నయన్ బికినీ ధరించింది. మంచి బాడీ షేమింగ్ ఉండటంతో నయన్ కి బికినీ సూపర్‌గా సూటయింది. అయితే అది పెళ్లికి ముందు కాబట్టి నో ప్రాబ్లమ్. ఇప్పుడు పెళ్లి చేసుకుంది కాబట్టి అంత గ్లామర్ ట్రీట్ ఇస్తుందా..? అనేది సందేహం.

    బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ అంటే హీరోయిన్స్ అందాలను ఆరబోయాల్సిందే. అందులోనూ నయన్ నటిస్తున్న మొదటి హిందీ సినిమా కాబట్టి నో అంటే కుదరదు. గత చిత్రం పఠాన్ లోనూ దీపిక ధరించిన బికినీ పెద్ద దుమారం రేపింది. పెళ్ళి తర్వాత ఇలాంటి స్కిన్ షో ఏంటీ..? అని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడు నయన్ విషయంలో కూడా అలాంటి చర్చ, రచ్చ జరగడం ఖాయం అంటున్నారు. అయితే, నిజంగా నయన్ జవాన్ మూవీలో బికినీ ధరిస్తే. దర్శకుడు అట్లీ నయన్‌ని బాగానే కన్విన్స్ చేశాడని చెప్పుకుంటున్నారు. ఇదంతా ఎంతవరకూ నిజమో జవాన్ రిలీజ్ అయితే గానీ తెలీదు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.