Vastu Tips: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఎన్నో ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటాము. ఈ క్రమంలోనే మన ఇంటిలో ఏ విధమైనటువంటి నర దిష్టి ప్రభావం లేకుండా ఉండటం కోసం ఎన్నో పరిహారాలు పాటిస్తూ ఉంటాము. అయితే మన ఇంటిపై ఎవరి దృష్టి పడకుండా ఉండటానికి ఇంటి ముందు బూడిద గుమ్మడికాయను కట్టడం మనం చూస్తుంటాము. అయితే బూడిద గుమ్మడికాయను కట్టడం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి ఏంటి అనే విషయానికి వస్తే..
నర దిష్టికి నారపరాయి అయిన పగులుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు అందుకే మన ఇంటిపై ఎవరి చెడు ప్రభావం పడకుండా ఉండడం కోసం గుమ్మడికాయను కట్టడం వల్ల మన ఇంట్లోకి ఏ విధమైనటువంటి చెడు ప్రభావం వెళ్లకుండా ఈ గుమ్మడికాయ ఆపుతుందని భావిస్తారు అందుకే ఇంటి బయట ప్రధాన ద్వారం వద్ద బూడిద గుమ్మడికాయను వేలాడదీసి ఉంటారు అయితే ఎప్పుడైతే ఈ బూడిద గుమ్మడికాయ కుళ్ళిపోయి ఉంటుందో వెంటనే దానిని తొలగించి దాని స్థానంలో మరొకటి కట్టాలి. ఇలా గుమ్మడికాయ కుళ్ళిపోయింది అంటే తప్పనిసరిగా మన ఇంటి పై చెడు ప్రభావం ఎక్కువగా ఉందని అర్థం.
ఇక ఈ గుమ్మడికాయ స్థానంలో మరొక గుమ్మడికాయను తీసుకువచ్చి కట్టాలి అయితే ఎలా పడితే అలా కట్టకూడదు కుష్మాండ పూజ చేస్తున్న తరువాతనే పురోహితుల చేత ఈ గుమ్మడికాయను కట్టించడం మంచిది. ఇక ఈ గుమ్మడికాయ కట్టిన తర్వాత ప్రతిరోజు అగరబత్తులతో ధూపం వేసి అగరబత్తులను వెలిగించడం చాలా మంచిది.ఇంటి ముందుకు వచ్చేటువంటి దోషాలు అంటే నరఘోష, నరపీడ, నరదృష్టి, నరశాప, నకారాత్మక శక్తిని అంతా కూడా కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయకు నిరోధించే శక్తి ఉంది కాబట్టి గుమ్మడికాయ విషయంలో ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకూడదు.