Spirtual: ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎన్నో ఆచార వ్యవహారాలు ఉంటాయి. అనాది కాలం నుంచి ఈ ఆచారాలు మన జీవన విధానంలో చాలా దగ్గరగా పెన వేసుకుపోయాయి. ముఖ్యంగా భారతీయ నాగరికత ఎన్నో ఏళ్లుగా ఉన్న సనాతన ధర్మం, హిందూ మతంలో అయితే ఎన్నో ఆచారాలు ఉన్నాయి. వాటి వెనుక ఒక బలమైన నమ్మకంతో పాటు మహర్షులు సృష్టించిన ఆయుర్వేద ఔషధాలకి దైవాన్ని లింక్ చేసి వాటిని తీర్ధ ప్రసాదాలుగా ఇవ్వడం మొదలు పెట్టారు. దేవుడితో సంబంధం ఉన్న వేటిని అయిన ఆ దైవం మీద నమ్మకం ఉన్నవాళ్ళు ఆచరిస్తారు. అలాగే తీసుకుంటారు.
ఈ కారణం చేతనే ప్రజారోగ్యాన్ని కూడా దైవానికి ముడిపెట్టి దైవసన్నిధిలో తయారు చేసే అన్ని రకాల ప్రసాదాలలో ఆరోగ్యాన్ని పెంచే ఔషధ మూలికల శక్తి ఉండే విధం గా ప్రణాళిక చేశారు. ఈ విషయాన్ని ప్రజలకి చెప్పకపోయిన వాటిని మహర్షులు గ్రంధస్తం చేయడం ద్వారా నేటి తరానికి హిందూ మతంలో ఉండే ఆచార వ్యవహారాల వెనుక ఆంతర్యం ఏంటి అనేది అవగతం అవుతుంది. ఇదిలా హిందువులు దర్శనం కోసం ఆలయాలకి వెళ్తారు. ఆ సమయంలో పురోహితులు మంత్రోచ్చారణ చేసి దేవుడిని పూజించడంతో చివరిగా తీర్ధప్రసాదాలు కూడా ఇస్తారు.
తీర్ధ ప్రసాదం ఇచ్చే సమయంలో అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, పాదోదకం, పావనం అనే మంత్రాన్ని కూడా చదువుతారు. ఈ మంత్రం తీర్ధం తీసుకునే సమయంలో ఈ ఆచంమనం చేస్తున్న వారిపై మంత్ర ప్రభావం పని చేస్తుందని చాలా బలంగా నమ్ముతారు. భగవత్ సన్నిధిలో ఆ దేవుడిని అభిషేకించిన దాన్ని ఒక పంచలోహ గిన్నెలో వేసి అందులో తులసి ఆకుని వేసి దానిని తీర్ధంగా భక్తులకి అందిస్తారు. అలాగే కొన్ని ఆలయాలో పానకం, క్షీరాన్ని, కొబ్బరి నీళ్ళని తీర్ధంగా ఇస్తారు.
ఇలా ఇచ్చిన తీర్ధంతో ఔషధ గుణాలు ఉంటాయని వీటిని తాగడం వలన శరీరంలో ఉన్న ఎలాంటి అనారోగ్య లక్షణాలు అయిన తొలగిపోతాయని పురోహితులు చెబుతారు. నిజంగానే భగవత్ సన్నిధిలో ఇచ్చే తీర్ధంలో ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు కూడా చెబుతున్న మాట. ఈ తీర్ధాన్ని మగవారు అయితే ధోవతిని ఎడమ చేత్తో పట్టుకొని దానిపై కుడిచేతిని పట్టి దానితో తీర్ధాన్ని తీసుకోవాలి. ఆడవాళ్ళు పైట చెంగుని కుడిచేతి పెట్టి తీర్ధాన్ని స్వీకరించాలి అని హిందుత్వ ఆచారాలలో ఉంది.