Health: మహా శివుడికి అత్యంత ప్రీతికరమైన పత్రిలో మారేడు దళాలు ఒకటి. ఈ మారేడు దళ పత్రితో పరమశివుడిని ఆరాధిస్తే ఎంతో మంచిదని, కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఈ నమ్మకంతోనే మారేడు దళాలతో మహాశివరాత్రి రోజు శివుడిని ఆరాధిస్తారు. ఇదిలా ఉంటే మారేడు పత్రిని కేవలం ఆద్యాత్మిక సంబంధ పూజలలోకే కాకుండా ఆయుర్వేద ఔషదంగా కూడా ఉపయోగిస్తారు. మారేడు కాయలు, అలాగే మారేడు ఆకులతో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని మారేడు ఆకులు చర్మ సంబంధ వ్యాధులని తగ్గిస్తాయి.
అలాగే జీర్ణక్రియ వ్యవస్థని క్రమబద్దీకరిస్తుంది. అలాగే ఒంట్లో వేడిని నియంత్రించ డానికి కూడా ఈ మారేడు ఆకులు ఎంతో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. దీని కోసం మారేడు పండు గుజ్జుని మెంతులు వేసి దంచాలి. అలాగే తయారైన పేస్టుని తలకి పట్టి కొద్ది సేపటి తర్వాత స్నానం చేస్తే ఒంట్లో ఉన్న వేడి మొత్తం తగ్గుతుంది. అలాగే మారేడు గుజ్జుని నేరుగా కూడా తినొచ్చు. అల్సర్ లాంటి సమస్యలని ఇది దూరం చేస్తుంది.
అలాగే మారేడు పండు గుజ్జు నుంచి పానీయాలు కూడా కూడా తయారు చేస్తారు. ఇవి ఎక్కువగా స్ట్రీట్ డ్రింక్ గా ఎక్కువగా తాగుతారు. అలాగే మారేడు ఆకులని నీటిలో వేసి కొద్ది సేపు వేడి చేసి దానిని ఒక కషాయం తరహాలో తయారు చేసుకొని అందులో తేనె లేదా ఉప్పు లాంటివి కలుపుకొని త్రాగడం వలన బరువు తగ్గడంతో పాటు జీర్ణ సంబంధ సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి. అందుకే మారేడుని ఎక్కువగా ఆయుర్వేద మందులలో కూడా ఉపయోస్తారు. పల్లెల్లో, అడవి ప్రాంతాలలో ఈ మారేడు చెట్లు ఎక్కువగా ఉంటాయి.
అలాగే ఈ మారేడు పత్రికి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని, పంచాక్షరి మంత్రం జపిస్తూ ఈ మారేడు పత్రాలతో పూజలు చేయడం వలన మానసిక ప్రశాంతత కూడా దొరుకుతుందని ఆయుర్వేద నిపుణుల మాట. అయితే మారేడు పత్రాలలో ఇన్ని రకాల ఆయుర్వేద లక్షణాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. ఇలాగే మన చుట్టూ ఉన్నా వృక్ష సంపదలో ఎన్నో ఆయుర్వేద లక్షణాలు ఉంటాయి. వాటిని తెసుకొని సక్రమంగా ఉపయోగిస్తే మన రోజు వారి జీవన విధానాలలో చాలా మార్పు చేసుకోవచ్చు.