Spirtual: సనాతన హిందూ ధర్మంలో ఎన్నో ఆచార వ్యవహారాలు ఉన్నాయి. అనాదిగా హిందువులు వాటిని ఆచరిస్తూ వస్తున్నారు. ఈ ఆచారాలని మహర్షులు పెట్టడానికి ఒక శాస్త్రీయమైన కారణాలు కూడా ఉన్నాయి. అయితే ఆ శాస్త్రీయ కారణాలు నేటి తరం స్త్రీలలో చాలా మందికి తెలియదు. అలాగే మారుతున్న కాలం తో పాటు పాశ్చాత్య నాగరికత, కట్టు, బొట్టుకి మన భారతీయ స్త్రీలు కూడా అలవాటు పడ్డారు. సుమారు 50 ఏళ్ల క్రితం వరకు భారతీయ స్త్రీలు చీరని మాత్రమే ధరించేవారు.
ఈ మధ్యకాలంలోనే వస్త్రవిధానంలో మార్పులు వచ్చాయి. అయితే ఇప్పటికి భారతీయ సంప్రదాయ వేడుకలలో స్త్రీలు చీరలు కట్టుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇక ఈ చీర ధరించడంలో శాస్త్రీయ కోణాలు ఉన్నాయనే విషయాన్ని ఇప్పటికే చెప్పుకున్నాం. మానవ శరీరం పంచభూతాల శక్తి అయిన స్వరూపంగా భావిస్తారు. ప్రకృతిలో ఉండే పంచభూతాల కలయికతోనే ఈ దేహం నిర్మితమవుతుంది. అలాగే దేహంలో ఉన్న ఆత్మని పరమాత్మ స్వరూపంగా భావిస్తాము.
అందుకే భారతీయ సనాతన ధర్మం ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడు. ఆ దైవత్వాన్ని ముందుగా మనం తెలుసుకోవాలి అని చెబుతుంది. అయితే ఈ విషయాన్ని హేళన చేసే వారు కూడా ఉంటారు. అలాగే మన భారతీయ హిందూ ధర్మంలో స్త్రీలని భూమితో, శక్తి స్వరూపిణిగా భావిస్తారు. ఈ కారణంగానే స్త్రీలని గౌరవించాలి అని కూడా చెబుతారు. భూమిలో శక్తి ప్రసరణ, కదలిక ఎలా ఉంటుందో అలాగే స్త్రీలలో కూడా ఉంటుంది. విశ్వ శక్తి భూమిని చేరినపుడు ఆ శక్తి ప్రసరణని నియంత్రించడానికి నీరు, చెట్లు ఒక వస్త్రంలా ఉంటాయి.
అలాగే విశ్వ శక్తి మానవ శరీరంలోకి కూడా చేరుతుంది. దీనిని శరీరంలో అణువణువునా ప్రసరించి, శక్తి ప్రసరణ జరిగేలా స్త్రీ చీర కట్టు చేస్తుంది. అన్ని అవయవాలకు సరైన విధంగా చేరేలా ఈ చీరకట్టు పని చేస్తుంది. ఈ కారణంగానే స్త్రీలు చీరలని ధరించాలని సనాతన ధర్మం చెబుతుంది. అలాగే బయటి నుంచి నెగిటివ్ వైబ్ ఏదైనా కూడా స్త్రీలలో నిండుగా చీరకట్టు ఉండటం వలన లోపలి వెళ్లకుండా ఆగుతుందని శాస్త్రం చెబుతుంది. ఈ శాస్త్ర సంబంధ విషయాలని అర్ధం చేసుకుంటే చీరకట్టు గొప్పతనం అందరికి తెలుస్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.