Devotional Tips: సాధారణంగా మనం ఏ పూజ చేసిన లేదా ఏ శుభకార్యం చేసిన ముందుగా ఆదిదేవుడు అయినటువంటి వినాయకుడికి పూజ చేస్తుంటాము. ఈ విధంగా వినాయకుడికి పూజ చేయడం వల్ల మనం చేసే కార్యం లేదా మంచి పని ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరుగుతుందని భావిస్తుంటారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా వినాయకుడికి మొదటి పూజ చేస్తూ ఉంటారు.
ఇకపోతే చాలామంది వినాయకుడితో పాటు లక్ష్మీదేవి చిత్రపటం ఉన్నటువంటి ఫోటోని పెద్ద ఎత్తున పూజలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇలా వినాయకుడితో పాటు లక్ష్మీదేవిని ఎందుకు పూజించాలి అనే విషయాన్ని వస్తే.. సంపదకు మూల కారణం అయినటువంటి లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుందని భావిస్తారు. అయితే ఇలా అమ్మవారిని పూజిస్తే మనకు సంపద కలుగుతుంది అయితే ఆ సంపద రావడానికి మనకు ఏ విధమైనటువంటి ఆటంకాలు కలగకూడదు.
ఇలా మనం కష్టపడి పని చేస్తూ డబ్బు సంపాదిస్తున్న ఆ డబ్బు మనకి చేరే మార్గంలో ఏ విధమైనటువంటి ఆటంకాలు కలుగకుండా ఉండడం కోసం మనం విగ్నేశ్వరుడిని పూజిస్తాము. ఇలా విగ్నేశ్వరుడికి మొదటి పూజ చేసిన తరువాతనే లక్ష్మీదేవిని కూడా పూజించడం వల్ల సంపదకు ఏ మాత్రం లోటు ఉండదని అలాగే మనం చేసే ఆ పనిలో ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉంటాయని పండితులు చెబుతారు. అందుకే ఎక్కువగా లక్ష్మీదేవి వినాయకుడి చిత్రపటాన్ని తప్పనిసరిగా పూజించడం మంచిది.