Tea: టీ ఈ పేరు వింటేనే చాలామందికి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఉదయం లేవగానే ఒక కప్పు టీ తాగిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వారి పనులలో నిమగ్నం అవుతూ ఉంటారు. అయితే చాలామంది టీ తయారు చేసేటప్పుడు వారి వారి స్టైల్ లో తయారు చేసుకుంటూ ఉంటారు. ఇకపోతే చాలామంది టీ మంచి రుచిగా సువాసనగా ఉండాలని ఎక్కువగా మరగనిస్తారు.
ఈ విధంగా టీ ఎక్కువసేపు మరగడం వల్ల చాలా రుచిగా ఉంటుందని భావిస్తూ ఉంటారు కానీ టీ ఎక్కువ సేపు మరిగించడం వల్ల రుచిగా రావడం ఏమో కానీ ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టీని 4 నిమిషాల కంటే ఎక్కువగా మరిగిస్తే కనుక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఆ ఇబ్బందులు ఏంటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..
టీలో చాలా టానిన్లు ఉంటాయి. ఇది శరీరంలోకి ప్రవేశించే అనేక అణువులను విచ్ఛిన్నం చేయడంలో ఇబ్బందిని సృష్టిస్తుంది. టీని ఎక్కువసేపు అంటే నాలుగైదు నిమిషాల కంటే ఎక్కువసేపు మరిగిస్తే.. టానిన్లు శరీరంపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి మన శరీరంలోకి వెళ్లినటువంటి ఐరన్ ను శరీరం గ్రహించలేక పోతుంది.ఎక్కువగా మరిగించిన టీ మీలో జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. కడుపు నొప్పి, ఇతర కడుపు సమస్యలు వస్తాయి. ఇది కాకుండా క్యాన్సర్‌కు కారణమయ్యే క్యాన్సర్ కారకాలు టీని ఎక్కువగా మరిగిస్తే ఏర్పడతాయి. ఇక రోగనిరోధక శక్తిపై కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది. అందుకే టి ఆరోగ్యంగా తాగాలి అంటే కేవలం నాలుగు నిమిషాలు మరిగిస్తే చాలని నిపుణులు చెబుతున్నారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.