Categories: EntertainmentLatest

Rashmika Mandanna : నువ్వు నా ఫ్యామిలీ రా

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరు చెప్పగానే చాలామంది మైండ్ లో వెంటనే రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గుర్తొచ్చేస్తాడు. ఎందుకంటే వీళ్లిద్దరి గురించిన వార్తలు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. వీళ్లిద్దరూ ఫ్రెండ్సా? లవర్సా? అనేది ఇప్పటికీ ఓ సస్పెన్సే. రష్మిక, విజయ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ఎప్పటికప్పుడు నెట్టింట్లో వార్తలు వస్తూనే ఉంటాయి. వీరిద్దరు దిగిన ఫోటోలను కూడా వైరల్ చేస్తుంటారు. ఇదిలా ఉంటే లేటెస్టుగా విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ గం గం గణేశా అనే ఓ కొత్త కామెడీ మూవీతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కు రష్మిక స్పెషల్ గెస్టుగా వచ్చింది. ఆనంద్ తో చేసిన సరదా చిట్ చాట్ లో విజయ్‌తో తనకున్న బాండింగ్ గురించి ఓ క్లారిటీ ఇచ్చేసింది ఈ భామ.

rashmika-mandanna-gave-clarity-on-her-relation-with-vijay-devarakonda

బేబీ సూపర్ హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ చేస్తున్న మూవీ ‘గం గం గణేశా’. మే 31న ఈ సినిమా థియేటర్లలోకి విడుదల కానుంది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‍‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు మేకర్స్. దీనికి చీఫ్ గెస్టుగా రష్మిక వచ్చింది. సరదాగా ఆనంద్ దేవరకొండ అడిగిన ప్రశ్నలకు కూల్ గా జవాబులు ఇచ్చి ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేసింది. సోషల్ మీడియాలో రష్మిక పోస్ట్ చేసిన పెట్ డాగ్స్ పిక్స్ చూపించి, వీటిలో ఏ కుక్క నీకు బాగా ఇష్టమని అడిగాడు. దీంతో ఆరా నా ఫస్ట్ బేబీ, స్టార్మ్ నా సెకండ్ బేబీ అని ఆన్సర్ ఇచ్చింది.

rashmika-mandanna-gave-clarity-on-her-relation-with-vijay-devarakonda

ఆ తర్వాత నీ ఫేవరెట్ కో స్టార్ ఎవరు? అని అడిగాడు ఆనంద్. దీంతో ఆనంద్‌ని సరదాగా తిట్టి .. ఆ వెంటనే మైక్ లో.. ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీరా అని అని ఇలా స్పాట్‌లో పెడితే ఎలా అని అంటుంది. దీంతో ఈవెంట్‌కి వచ్చిన వారంతా రౌడీ, రౌడీ స్టార్ అని గట్టిగట్టిగా అరిచారు. దీంతో రౌడీ బాయే నా ఫేవరేట్ అని విజయ్‌ని ఉద్దేశించి రష్మిక ఆన్సర్ ఇచ్చేసింది. ఇలా రష్మిక-విజయ్ ఎంత క్లోజ్ అనేది మరోసారి రుజువైంది.

Sri Aruna Sri

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.