Health Tips: సాధారణంగా చాలామంది ఉదయం అల్పాహారానికి బదులుగా ఇతర పదార్థాలను తీసుకుంటూ అల్పాహారం స్కిప్ చేస్తూ ఉంటారు. ఇలా టిఫిన్ చేయకపోవడం వల్ల ఎన్నో ప్రమాదాలు తప్పవు అనే విషయం తెలిసినప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో చాలామంది కాస్త ఆశ్రద్ధ చూపిస్తూ ఉంటారు. అయితే అల్పాహారానికి బదులు చాలామంది ఫ్రూట్స్ లేదా పాలు వంటి పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. అయితే పండ్లు తినడం మంచిదే కానీ కాలి కడుపున కొన్ని పండ్లను పొరపాటున కూడా తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మరి కాళీ కడుపుతో ఎలాంటి పండ్లను తినకూడదు అనే విషయానికి వస్తే.. యాపిల్ తినడం ఆరోగ్యానికి మంచిదని చాలామంది ఉదయం ఏ విధమైనటువంటి అల్పాహారం తీసుకోకుండా ఆపిల్ తింటూ ఉంటారు అయితే ఆపిల్ పరగడుపున తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. యాపిల్ పండులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది అందుకే ఖాళీ కడుపుతో తినడం వల్ల అజీర్తి గ్యాస్ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి.
ఇక అరటి పండును కూడా కాళీ కడుపుతో అసలు తినకూడదు. అరటి పండులో చక్కరలు,మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణం అవుతాయి. మరియు కొందరిలో గ్యాస్ సమస్య తలెత్తేలా కూడా చేస్తాయి. ఇక వీటితో పాటు సిట్రస్ జాతికి చెందిన పండ్లను కూడా పరగడుపున తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సిట్రస్ పండ్లు మీ ప్రేగుల్లో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతాయి. పొట్టలో పుండ్లు, గ్యాస్ట్రిక్ అల్సర్ల ప్రమాదాన్ని రెట్టింపు చేస్తాయి. మీ జీర్ణవ్యవస్థ పనితీరును దెబ్బ తీస్తాయి. వీటితోపాటు పుచ్చకాయ బొప్పాయి పైనాపిల్ వంటి పండ్లను కూడా తినకూడదు.