Hanuman: సాధారణంగా ప్రతి ఒక్కరూ వారి ఇష్ట దైవాన్ని పూజిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వారి ఇష్ట దేవత విగ్రహాలను ఇంట్లో పెట్టుకుని ప్రతిరోజు పూజా కార్యక్రమాలతో పాటు స్వామివారికి నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే చాలామంది ఆంజనేయస్వామిని పూజిస్తూ ప్రతి శని మంగళవారాలలో స్వామివారికి ప్రత్యేకంగా నైవేద్యాలను సమర్పిస్తూ పూజిస్తుంటారు. అయితే చాలామంది వివిధ రకాల చిత్రపటాలను పెట్టి పూజించడమే కాకుండా ఏకంగా స్వామివారి విగ్రహాలను కూడా పూజిస్తూ ఉంటారు.
ఇక ఇంట్లో ఆంజనేయ స్వామి విగ్రహాలను పూజించేవారు వారికి తెలిసి తెలియకుండా కొన్ని ప్రదేశాలలో పెట్టి పూజలు అయితే ఇలా కొన్ని ప్రదేశాలలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పెట్టి పూజించడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది మరి ఏ ప్రదేశంలో స్వామివారి విగ్రహాలను పెట్టకూడదు ఎక్కడ పెడితే ఉత్తమము అనే విషయాన్ని వస్తే…పంచముఖ ఆంజనేయుడు పంచముఖ ఆంజనేయుని బొమ్మను ఇంట్లో ఉంచుకోవడం వల్ల దుష్టశక్తులు దూరమవుతాయి. కుటుంబానికి ఎటువంటి దుష్టశక్తుల ప్రభావం ఉండదు అలాగే నరదిష్టి కూడా తొలగిపోతుంది.
ఇక ఇంట్లో ప్రవేశద్వారం వద్ద పంచముఖ హనుమంతుడి ఫోటో ఉంచడం ఎంతో మంచిది అలాగే దక్షిణ దిశ వైపు కూడా ఆంజనేయ స్వామి చిత్రపటం ఉంచడం మంచిది. హిందూ పురాణాల ప్రకారం, హనుమంతుని ప్రభావం దక్షిణాదిలో బలంగా ఉంది. అందుకే దక్షిణ దిశ వైపు ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని పెట్టడం వల్ల ఏ విధమైనటువంటి దుష్టశక్తుల ప్రభావం ఉండదు అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనపై ఉంటుంది.ఇక వివిధ రకాల చిత్రపటాలను మనం ఇంట్లో పెట్టుకుని పూజించుకోవచ్చు. ఒక్కో చిత్రపటం ఒక్కో శుభ ఫలితాలను అందిస్తుంది కనుక ఇంట్లో ఆంజనేయ స్వామి చిత్రపటం లేదా విగ్రహాన్ని పెట్టి పూజించుకోవడం ఎంతో మంచిది.