Vastu Tips: సాధారణంగా మనం హిందూ ఆచార సాంప్రదాయాలతో పాటు వాస్తు నియమాలను కూడా ఎంతో పద్ధతిగా ఆచరిస్తూ ఉంటాము. ఈ క్రమంలోనే మన ఇంట్లో అలంకరించుకునే వస్తువులను కూడా వాస్తు ప్రకారమే అలంకరించుకుంటూ ఉంటాము అయితే పడకగదిలో చాలామంది మంచం వేసుకున్న తర్వాత మంచం కింద ఉన్నటువంటి ఆ ఖాళీ స్థలాన్ని ఇతర అవసరాలకు ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మంచం కింద చాలా మంది వివిధ రకాల వస్తువులను సర్ది ఉంటారు. మరి మంచం కింద ఎలా ఉండడం మంచిదేనా మంచం కింద ఏ ఏ వస్తువులను ఉంచకూడదు అనే విషయానికి వస్తే…
పడకగదిలో మనం నిద్రపోయే మంచం కింద ఎప్పుడూ కూడా ఇలాంటి వస్తువులను ఉంచకూడదు పొరపాటున కూడా మంచం కింద ఈ వస్తువులను పెడితే మాత్రం మనం తీవ్రమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు అందుకే మంచం కింద ఈ వస్తువులు కనుక ఉంటే వెంటనే తొలగించమని చెబుతున్నారు మరి ఆ వస్తువులు ఏంటి అనే విషయానికి వస్తే… మంచం కింద పొరపాటున చీపురు లేదా చాట ఈ రెండు వస్తువులను అసలు పెట్టకూడదు ఇలా పెట్టడం వల్ల ఆర్థిక ఇబ్బందులు మాత్రమే కాకుండా మానసిక పరిస్థితి కూడా దెబ్బతింటుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం మంచం కింద బంగారం, వెండి అలాగే లోహపు ఆభరణాలను అస్సలు ఉంచకూడదు. దీనితో పాటు బూట్లు, చెప్పులు కూడా ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ వ్యాప్తి చెందుతుంది. మంచం కింద తుప్పు పట్టిన ఇనుప వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులను ఉంచకూడదు. దీని వల్ల ఇంట్లో వాస్తు దోషం ఏర్పడి ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఇక మంచం కింద ఎలక్ట్రానిక్ వస్తువులను పెట్టడం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉంటాయి కనుక పొరపాటున కూడా మంచం కింద ఈ వస్తువులను పెట్టకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.