Unborn Baby: మన పురాణాలలో అభిమాన్యుడి కథ విన్నప్పుడు అతను తల్లి గర్భంలో ఉన్నప్పుడే పద్మవ్యూహంలోకి వెళ్ళడం నేర్చుకున్నాడు అని చెబుతారు. అలాగే ప్రహ్లాదుడు తల్లిగర్భంలో ఉన్నప్పుడు నారదుడు వచ్చి అతనికి నారాయణ మంత్రం చెప్పడం వలన దానిని తరువాత కూడా మనస్సుకి ఎక్కించుకొని తండ్రికి శత్రువుగా మారాడు. అలాగే హిరక్యకశిపుడు మరణానికి కారణం అయ్యాడు. అయితే ఈ రెండు కథలలో కామన్ గా కనిపించే పాయింట్ తల్లి గర్భంలో ఉన్నప్పుడు బిడ్డ మనం చెప్పే ప్రతి విషయాన్ని వింటాడు. శిశువు పెరిగే దశలో బాహ్య ప్రపంచంలో ఉన్న శబ్ద తరంగాలని గర్భంలో నుంచి వినడం ద్వారా దానికి రియాక్ట్ అవుతాడు అని అంటారు. తల్లి కూడా ఒక్కో సారి బిడ్డ స్పందనలని స్పర్శ ద్వారా తెలుసుకుంటుంది.
అందుకే తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఎక్కువగా సానుకూల దృక్పథంతో ఉండాలని, అలాగే పాజిటివ్ ఆలోచనలు పెంపొందించుకోవాలి అని చెబుతారు. అలాగే భగవద్గీత వినడం, రామాయణం, మహాభారతం వంటివి చదవడం చేయాలని సూచిస్తూ ఉంటారు. అలాగే స్పూర్తినిచ్చే కథలు చదవాలని చెబుతూ ఉంటారు. గొడవలకి దూరంగా ఉండాలని అంటూ ఉంటారు. మన పురాణాల ప్రకారం అనాదిగా వస్తున్న కథల ఆధారంగా శిశువు గర్భంలో ఉన్నప్పుడే నేర్చుకునే సామర్ధ్యం కలిగి ఉంటారు అనేది నమ్ముతూ ఉంటారు. అయితే దీనిపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి ఆసక్తికర విషయాలు చెప్పారు.
గైనకాలజిస్టుల అభిప్రాయం ప్రకారం గర్భంలో ఉన్న శిశువు శబ్దాలు వినగలదు కాని భాషని అర్ధం చేసుకోలేదు. దీనిని బట్టి మనం మాట్లాడే మాటలు గాని, లేదంటే రామాయణం, మహాభారతం లాంటి కథలు గాని ఎంత వరకు శిశువు అర్ధం చేసుకుంటుంది అనేది చెప్పలేం అంటున్నారు. సైకాలజిస్టుల అభిప్రాయం ప్రకారం అయితే `13వ వారం నుంచి శిశువు వినడం అలవాటు చేసుకుంటుంది. అలాగే తల్లి భాషని అర్ధం చేసుకుంటుంది. తల్లి, ఇతరుల స్వరాన్ని మధ్య తేడాని తెలుసుకుంటుంది. కొన్ని శబ్దాలకి గర్భస్థ శిశువు స్పందిస్తుంది. ఒకే విషయాన్ని పదే పదే చెబితే కచ్చితంగా గర్భంలో శిశువు స్పందన వేరే విధంగా ఉంటుంది. అలాగే తల్లి ఒత్తిడికి గురైతే బిడ్డ మీద దాని ప్రభావం ఉంటుంది. అలాగే కొన్ని సౌండ్స్ ని విని మైండ్ లో నిక్షీప్తం చేసుకుంటుందని చెబుతున్నారు. దీనిని బట్టి శాస్త్రీయంగా మనం నమ్ముతున్న అభిమాన్యుడి, ప్రహ్లాదుడు కథల సారం నిజం అని అర్ధం చేసుకోవచ్చు.