Dhana Trayodadhi: మన హిందూ సంప్రదాయాల ప్రకారం పండుగలకు ఎంతో ప్రాధాన్యత ఉంది.. కో పండుగ వెనుక ఎన్నో పురాణ గాథలు ఉన్నాయి అందుకే ప్రతి ఒక్క పండుగను ఎంతో సంప్రదాయబద్ధంగా అలాగే ఘనంగా జరుపుకుంటాము. ఇక దసరా పండుగను ఎంతో ఘనంగా జరుపుకున్నటువంటి మనం త్వరలోనే దీపావళి పండుగను కూడా అంతే ఘనంగా జరుపుకుంటారు అయితే దీపావళికి ముందు రోజు వచ్చే ధన త్రయోదశి కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటాము. ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసంలోని కృష్ణపక్షంలో బహుళ త్రైయోదశి రోజు ధన్ త్రయోదశిని జరుపుకుంటారు. ధన త్రయోదశి 2023 వ సంవత్సరంలో ఎప్పుడు వస్తుంది. ఆ రోజున ఎలాంటి పూజలు నిర్వహిస్తారు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పురాణాల ప్రకారం భీమా అనే రాజుకు ఒక కుమారుడు ఉండేవాడు. వీరిది క్షత్రియ వంశం కాబట్టి విలువిద్యాలన్నీ అతనికి నేర్పిస్తాడు.అయితే రాకుమారుడికి వివాహమైన నాలుగో రోజే మరణిస్తాడు అని కొందరు చెబుతారు.అయినా ఒక రాజ వంశానికి చెందిన యువతీ రాకుమారుడిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారు. భర్తను కాపాడుకోవడానికి తన వద్ద ఉన్న అభరణాలన్నీ రాశులుగా పోసి వాటి ముందు దీపాలను వెలిగించి తన ఆరాధ్య దేవత లక్ష్మీ దేవిని పూజిస్తుంది. ఇంతలోపే యమధర్మరాజు ఆ రాజకుమారుడు ప్రాణాలు తీయడానికి పాము రూపంలో అక్కడికి వెళ్తారు.
ఇలా రాజకుమారుడి ప్రాణాలు తీయాలని వెళ్లినటువంటి పాముకి అక్కడ ఉన్నటువంటి దీపపు కాంతుల వల్ల లోపలికి ప్రవేశించలేక పోతాడు అలాగే ఆమె లక్ష్మీదేవి పాటలు పాడడంతో పాము కూడా మైమరిచిపోయి తను వచ్చిన పని చేయడం మర్చిపోతుంది. దీంతో యమగడియలు దాటిపోతాయి. అందుకే ధన త్రయోదశి రోజు ప్రధాన ద్వారం రెండు వైపులా దీపం వెలిగించడం వల్ల ఏ విధమైనటువంటి చెడు జరగదు అలాగే అమ్మవారిని పూజించడం వల్ల లక్ష్మి కటాక్షం మనపై ఉంటుంది. ఈరోజు కనుక బంగారం కొంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని మనం ఇంటికి తెచ్చుకున్నట్లు అని భావిస్తారు అయితే ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు కొనుగోలు చేస్తారు. ఇక ఈ ఏడాది నవంబర్ 10వ తేదీ ధన త్రయోదశి జరుపుకుంటారు.