Karthika Masam: మన హిందూ క్యాలెండర్ ప్రకారం 12 నెలలలో ప్రతి నెలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే వచ్చే మాసం కార్తీక మాసం కావడంతో కార్తీకమాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసంగా భావిస్తారు. అందుకే కార్తీకమాసం మొత్తం ప్రతి ఒక్క ఆలయాలలో పండుగ వాతావరణం నెలకొంటుంది. కార్తీక మాసంలో పెద్ద ఎత్తున మహాశివుడికి అలాగే విష్ణుమూర్తికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. మరి ఈ ఏడాది కార్తీక మాసం ఇప్పుడు నుంచి ప్రారంభమవుతుంది కార్తీక మాసంలో ఎలాంటి చేయాలి అనే విషయానికి వస్తే…
కార్తీక మాసం శివుడికి, మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం. కార్తీక సోమవారం, జ్వాలాతోరణం మహాశివుడి ప్రాముఖ్యతకు.. బలి పాడ్యమి, ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి శ్రీ మహావిష్ణువు ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తాయి. కార్తీక పురాణంలోని మొదటి 15 అధ్యాయాలు శివుడి ప్రాముఖ్యతను, ఆఖరి 15 అధ్యాయాలు శ్రీ మహావిష్ణువు ప్రాధాన్యతను తెలియచేస్తాయి. అయితే ప్రతి ఏడాది దీపావళి మరుసటి రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా నవంబరు 14న ప్రారంభమై డిసెంబరు 13తో అవుతుంది.
ఎంతో పవిత్రమైనటువంటి ఈ కార్తీకమాసంలో ప్రత్యేకంగా శివకేశవులకు పూజ చేయడం ఎంతో ముఖ్యం అలాగే సంధ్యా సమయంలో దీపం వెలిగించడం వల్ల ఆ ఇంటికి అన్ని శుభ ఫలితాలే కలుగుతాయని భావిస్తారు. కార్తీక మాసంలో ఎలాంటి పరిస్థితులలో కూడా మాంసాహారం తీసుకోకూడదు. పేదలకు దానధర్మాలు చేయడం ఎంతో మంచిది. ఈ దానధర్మాలను గోప్యంగా చేయటం వల్ల రెట్టింపు ఫలితాలు కూడా అందుకోవచ్చు. కార్తీక మాసంలో దీపారాధన చేయటం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి.