Lord Ganesh: సాధారణంగా మనం పడుకునే సమయంలో కొన్ని రకాల కలలు రావడం సర్వసాధారణం. అయితే కొన్ని పీడ కలలు రాగా కొన్ని మంచి కలలు వస్తూ ఉంటాయి. అయితే కలలో దేవతలతో పాటు ఎన్నో రకాల వస్తువులు జంతువులు కూడా మనకు కనపడుతూ ఉంటాయి. మరి కలలో కనక విగ్నేశ్వరుడు కనపడితే ఏం జరుగుతుంది విఘ్నేశ్వరుడు కనిపించడం దేనికి సంకేతం అనే విషయానికి వస్తే…
మీరు పడుకున్న తర్వాత కలలో కనక బంగారు వర్ణంలో ఉన్నటువంటి వినాయకుడు కనుక కలలో కనపడితే మీకు సంపద కలుగుతుందని అర్థం. అలాగే వినాయకుడు కనక నాట్యం చేస్తున్నట్లు కనపడితే మీ జీవితంలో ఆనందం సంతోషం వేల్లు విరుస్తాయని సంకేతం. ఒకవేళ కలలో బాల వినాయకుడు కనిపిస్తే జీవితంలో కొత్త ప్రారంభానికి సంకేతంగా భావించాలి. బాల వినాయకుడు అమాయకత్వం, స్వచ్ఛత, రక్షణకు ప్రతీకగా చెబుతారు. వినాయకుడు విశ్రాంతి తీసుకుంటూ కనిపిస్తే జీవితంలో ప్రశాంతమైన దశను చూచిస్తుంది.
విరిగిన దంతంతో కూడిన వినాయకుడి రూపం కలలో కనిపిస్తే అది త్యాగానికి ప్రతీకగా చెప్పొచ్చు. తొండం అడ్డంకులను అధిగమించడాన్ని సూచిస్తుంది. ఇక ఏనుగు రూపంలో వినాయకుడు కనక కనపడితే మన కోరికల పై నియంత్రణ పొందగలుగుతున్నారని అర్థం. ఇలా వినాయకుడు కనుక కలలో కనపడితే అంతా శుభమే జరుగుతుంది తప్ప ఎలాంటి కీడు చెడు జరగదని అర్థం