Nagapanchami: శ్రావణమాసంలో జరుపుకునే పండుగలలో నాగపంచమి మొదటిది. శ్రావణ మాసంలో జరుపుకునే ఈ పండుగ ఎంతో ప్రత్యేకమైనదిగా చెబుతూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా నాగపంచమి రోజున ప్రత్యేకంగా నాగదేవతను పూజించడమే కాకుండా పుట్టకు లేదా నాగ దేవతల విగ్రహాలకు పాలు పోసి ప్రత్యేకంగా పూజిస్తూ ఆరోజు ఉపవాసంతో ఉంటారు. ఈ విధంగా నాగ పంచమి రోజు నాగదేవతను పూజించడం వల్ల మన జాతకంలో ఉన్న ఎలాంటి దోషాలైనా తొలగిపోతాయి.
మన జాతకంలో కాలసర్పదోషం ఉన్న రాహుకేతు దోషం ఉన్న నాగపంచమి రోజు నాగదేవతను ప్రత్యేకంగా పూజించడం వల్ల ఈ దోషాల నుంచి బయటపడవచ్చు. అదేవిధంగా నాగ పంచమి రోజు మనం తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తుంటాం అలాంటి తప్పులను అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. మరి నాగపంచమి రోజు ఏ విధమైనటువంటి తప్పులు చేయకూడదు అనే విషయానికి వస్తే..
నాగ పంచమి రోజు పొరపాటున కూడా మాంసాహార పదార్థాలను తినకూడదు అదే విధంగా చాలామంది చెట్లను నరకడం పదునైన వస్తువులతో పనులు చేయడం చేస్తుంటారు ఇలాంటి పనులు కూడా చేయకూడదు ముఖ్యంగా నేలను దుక్కి దున్న కూడదు. అదేవిధంగా నాగ పంచమి రోజు పరిసర ప్రాంతాలలో ఎక్కడైనా పాము కనిపిస్తే దానిని చంపకూడదు అలా చేయటం వల్ల జాతకంలో సర్ప దోషాలు బలపడతాయని పండితులు చెబుతున్నారు. ఇక చాలామంది నాగపంచమి రోజు పుట్టలో పాలు పోస్తూ ఉంటారు అలా పుట్టలో పాలు పోయడం మంచిది కాదు పుట్టలో ఒకవేళ పాములకు ఉన్నట్లయితే పాలు వాటికి విషంతో సమానమని చెబుతారు అందుకే పాలు నాగదేవతల విగ్రహాలకు పోసి పూజ చేయడం ఎంతో మంచిదని పండితులు చెబుతున్నారు.