Vinayakachavithi: హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలలో వినాయక చవితి పండుగ ఒకటి అయితే ప్రతి ఏడాది ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు కానీ ఈ ఏడాది మాత్రం ఈ పండుగను ఎప్పుడు జరుపుకోవాలి అనే సందిగ్ధత ప్రతి ఒక్కరిలోనూ ఉంది. వినాయక చవితి 18వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఉంది. ఈ క్రమంలోని ఎప్పుడు పండగ జరుపుకోవాలన్న సందిగ్ధంలో ప్రజలందరూ కూడా ఉన్నారు. మరి ఈ పండుగను ఎప్పుడు జరుపుకోవాలి ఏంటి అనే విషయానికి వస్తే…
వినాయక చవితి పండుగ 18వ తేదీ సోమవారం ఉదయం 10:15 నిమిషాల నుంచి ఈనెల 19న ఉదయం 10:43 నిమిషాల వరకు వినాయక చవితి పండుగ తిథి ఉంటుందని పండితులు తెలియజేశారు. ఈ క్రమంలోనే ఈ పండుగను కానిపాకంలో కూడా 18వ తేదీనే జరుపుకోవాలని పండితులు తెలియజేశారు. అందుకే ఈ పండుగను సోమవారం 10:15 నిమిషాలకు తర్వాత పూజ చేసుకోవడం ఎంతో ఉత్తమం. ఇలా 18వ తేదీనే పండుగ అని పండితులు నిర్ణయించడంతో ప్రభుత్వాలు కూడా 18వ తేదీని అధికారకంగా సెలవు దినంగా ప్రకటించింది.
19వ తేదీ ఉదయం 10:43 నిమిషాలకు వినాయక చవితి వెళ్లిపోతున్నటువంటి నేపథ్యంలోనే ఈ పండుగను 18వ తేదీ 10 గంటల తర్వాత జరుపుకోవాలని పండితులు తెలియజేస్తున్నారు. 18వ తేదీ దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగను ఎంతో ఘనంగా జరుపుకోనున్నారు.గతంలో 2000, 2009, 2010, 2019 సంవత్సరాల్లో కూడా తిథి విషయంలో ఇలాంటిదే సందిగ్ధం ఏర్పడితే.. తదియతో కూడిన చతుర్ధినే వినాయక చవితిగా జరుపుకున్నారని పండితులు తెలిపారు.