Rice: సాధారణంగా చాలామంది అధిక శరీర బరువుతో కనుక బాధపడుతూ ఉన్నట్లయితే డైట్ చేయడం కోసం కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం పూర్తిగా మానేస్తూ ఉంటారు ఇందులో భాగంగా రైస్ కూడా ఒకటి ఇలా మనం రైస్ తీసుకోవడం వల్ల అధిక శరీర బరువు పెరుగుతున్నారన్న ఉద్దేశంతో రైస్ బదులు వాటి స్థానంలో ఇతర ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉన్నారు. అయితే ఒక్కసారిగా ఇలా రైస్ తినకుండా మానేయడంతో మీరు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోయినట్టేనని నిపుణులు చెబుతున్నారు.
మరి మనం రైస్ తీసుకోకపోవడం వల్ల ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోతాము అనే విషయానికి వస్తే… మనం తీసుకునే రైస్ లో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల మనం తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం అవ్వడమే కాకుండా పేగులు శుభ్రపడటానికి కీలక పాత్ర పోషిస్తాయి. అదేవిధంగా మలబద్ధక సమస్య కూడా లేకుండా ఉంటుంది.
రైస్ లో కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అవి కణాలకు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి. అలాగే రైస్ లో ఉండే బి విటమిన్లు మన నాడీ వ్యవస్థను చురుగ్గా మారుస్తాయి.శరీరానికి ప్రధాన ఇంధన వనరు అయిన కార్బోహైడ్రేట్లకు రైస్ గొప్ప శక్తిని కలిగిస్తుంది ఇన్ని ప్రయోజనాలు కలిగినటువంటి రైస్ మనం పూర్తిగా మానేయటం వల్ల ఈ ప్రయోజనాలన్నింటిని కోల్పోతాము కనుక మనం ప్రతిరోజు ఆహారంలో భాగంగా ఒక పూట తప్పనిసరిగా అన్నం తీసుకోవడం మంచిది అయితే చాలామందికి వైట్ రైస్ తినేటప్పుడు ఇష్టం లేకపోతే దాని స్థానంలో బ్రౌన్ రైస్ తీసుకోవడం ఎంతో మంచిది.