Walking For Weight Loss: ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లు అనుగుణంగా చాలామంది వారి శరీర బరువు పెరిగిపోతూ ఉన్నారు. చిన్న వయసులోని ఎంతోమంది అధిక శరీర బరువు పెరిగి పోవడం వల్ల ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ విధమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే బరువు తగ్గడమే మార్గం ఈ క్రమంలోనే చాలామంది ఎన్నో విధాలుగా బరువు తగ్గడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే నడవడం ద్వారా బరువు తగ్గుతారని చాలామంది ప్రతిరోజూ ఉదయం సాయంత్రం వాకింగ్ చేస్తూ ఉంటారు.నిజంగానే వాకింగ్ చేయడం వల్ల శరీరం తగ్గుతారా నిపుణులు ఏం చెబుతున్నారు అనే విషయానికి వస్తే…
ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాకింగ్ చేయడం వల్ల శరీర బరువు తగ్గుతారు అనడానికి ఏ విధమైనటువంటి రుజువులు లేవు కానీ మనం ఎంతో ఆరోగ్యంగా ఉండగలము కేవలం వాకింగ్ చేయడం వల్ల ద్వారా మాత్రమే బరువు తగ్గుతారు అనడానికి ఆధారాలు లేవు మన శరీర తత్వాన్ని బట్టి మనం తీసుకున్న ఆహారం బట్టి మనం శరీర బరువు తగ్గుతాము అయితే గంటకు ఆరు కిలోమీటర్లు చొప్పున వేగంగా నడవటం వల్ల కొంతమేర మన శరీరంలో క్యాలరీస్ కరిగి శరీర బరువు తగ్గటానికి అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇక చాలామంది వాకింగ్ అంటే ఏదో సరదాగా అలా నడుస్తూ మాట్లాడుకుంటూ వెళుతుంటారు అయితే ఎప్పుడూ కూడా ఇలా వాకింగ్ చేయకూడదు వాకింగ్ చేసే వాళ్ళు వారు నిర్ణయించుకున్నటువంటి దూరానికి ఎక్కడ ఆగకుండా నెమ్మదిగా కాకుండా చాలా వేగంగా నడిచినప్పుడే మన శరీరంలో ఉన్నటువంటి క్యాలరీస్ కరిగి శరీర బరువు తగ్గడానికి దోహదపడుతుంది. అయితే పూర్తిగా నడవడం ద్వారా మాత్రమే బరువు తగ్గుతారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేకపోయినా కొంత మొత్తంలో మన శరీరంలోని క్యాలరీస్ కరుగుతాయి. ఇక చాలామంది విపరీతమైనటువంటి డైట్ ఫాలో అవుతుంటారు ఇలా డైట్ ఫాలో కావడం కూడా అనారోగ్యానికి కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తగిన పరిమాణంలో తీసుకొని ఎలాంటి ఒత్తిడి లేకుండా సరైన సమయానికి నిద్రపోవటం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటాము.