Vishwambhara: జరిగిన పొరపాటును మేకర్స్ ఒప్పుకున్నారా!

Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం కావడం విశేషం. త్రిష కృష్ణన్ కి లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో వచ్చిన అవకాశం. ఇక, దర్శకుడు మల్లిడి వశిష్ట ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా, ఎందుకు విడుదల వాయిదా పడిందో అందరికీ తెలిసిందే.

విశ్వంభర సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ టీజర్ ఏ ఒక్కరినీ అంతగా మెప్పించలేకపోయింది. దీనికి కొందరు అనుభవం సరిపోలేదని అంటే మరికొందరేమో ఇలాంటి జోనర్ సినిమాతో రిస్క్ చేయడమెందుకు అని కామెంట్స్ చేశారు. మొత్తానికి, ఒక్క టీజర్ ఈ మూవీపై పలు సందేహాలు వచ్చేలా చేసింది. దాంతో, చిత్ర బృందం విశ్వంభర సినిమాను అందరికీ నచ్చేలా తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. గత కొంతకాలంగా ఈ సినిమా విషయంలో ఎలాంటి అప్‌డేట్స్ రావడం లేదు.

vishwambhara-have-the-makers-admitted-the-mistake

Vishwambhara: మొదటగా వచ్చిన టీజర్ వీఎఫెక్స్ పరంగా మెప్పించలేకపోయింది.

మరో వైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్‌గారు సినిమా 300 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మెగా 158 మూవీ కోసం చిరు రెడీ అవుతున్నారు. మళ్ళీ సంక్రాంతికి రిలీజ్ చేసేలా దర్శకుడు బాబీ ప్లాన్ చేస్తున్నాడు. ఇలా, మెగాస్టార్ సినిమాల విషయంలో వరుస అప్‌డేట్స్ వస్తున్నాయి. అలాగే, విశ్వంభర ఏమైంది అనే మాట కూడా వినిపిస్తోంది. దీనికి తాజాగా యూవి క్రియేషన్స్ నిర్మాతల్లో ఒకరైన అజయ్ కుమార్ అప్‌డేట్ ఇచ్చాడు.

మొదటగా వచ్చిన టీజర్ వీఎఫెక్స్ పరంగా మెప్పించలేకపోయింది. ఒక పెద్ద స్టార్ సినిమాకి స్టార్టింగ్‌లోనే ఇలాంటి ఫీడ్ బ్యాక్ వస్తే పొరపాటే. అందుకే, సినిమా ఆలస్యం అయినా అత్యున్నత ప్రమాణాలతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని వీఎఫెక్స్ మీద ఎక్కువగా వర్క్ చేస్తున్నారు. త్వరలో, టీజర్ 2తో మిమ్మలిని సర్‌ప్రైజ్ చేస్తామని తెలిపారు. మొత్తానికి, ఫస్ట్ టీజర్ విషయంలో పొరపాటు జరిగిందని ఒప్పుకున్నట్టే. చూడాలి, మరి మెగా అభిమానులే కాకుండా ఇండస్ట్రీ వర్గాలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న విశ్వంభర సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ఎప్పుడు ప్రకటిస్తారో.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

9 hours ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

2 days ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

2 days ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

5 days ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

5 days ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

5 days ago

This website uses cookies.