Venu Swamy : మరోసారి ప్రభాస్ ఫ్యాన్స్‎కు కోపం తెప్పించిన వేణు స్వామి

Venu Swamy : ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ సెలబ్రిటీలు, ఫేమస్ పొలిటీషియన్స్ జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. వేణు స్వామి అప్పట్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, అక్కినేని నాగచైతన్య డివోర్స్ తీసుకుంటారని చెప్పి వర్తల్లో నిలిచారు. ఆ తర్వాత కొద్ది రోజులకే వీరిద్దరు విడాకులు తీసుకోవడంతో ప్రజలు వేణు స్వామి మాటలు నమ్మడం మొదలుపెట్టారు. అంతేకాదు ప్రభాస్ టైం బాగోలేదని, ఆయన జాతకం ప్రకారం సినిమాలు పెద్దగా హిట్ కావని చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహానికిగురై సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. దీంతో చాలా మంది సినీ సెలబ్రిటీలు ఆయనతో జాతకం చెప్పించుకునేందుకు క్యూలు కట్టారు. ఆయనతో స్పెషల్ పూజలు చేయించుకున్నారు. మిగతావారి విషయం పక్కన పెడితే ప్రభాస్ జాతకం చెప్పి వేణు స్వామి పెద్ద చిక్కుల్లోనే పడ్డాడు. ఈ మధ్యనే ప్రభాస్ ఏ సినిమా చేసినా హిట్ కాదు ఆయనతో సినిమా చేసేవారు జాతకం చూపించుకోవాలి అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. అయితే లేటెస్టుగా ప్రభాస్ నటించిన సలార్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మరోసారి ప్రభాస్ గురించి మాట్లాడిన వేణు స్వామి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వేణు స్వామి ఇక జ్యోతిష్యం చెప్పడం మానుకో అంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆయన్ని నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు.

venu-swamy-sensational-comments-on-prabhas

టాలీవుడ్ సెలబ్రిటీ జ్యోతిష్యుడుగా వేణు స్వామి గతంలో ప్రభాస్ కు బ్యాడ్ టైం నడుస్తోందని జ్యోతిష్యం చెప్పాడు. ఇకపై ప్రభాస్ కు సినిమాలు వర్కౌట్ కాదని, ఆయనతో సినిమా తీయబోయే వారు ఓసారి జాతకం చూపించుకోవాలని సూచించాడు. ఇది కనుక నిజం కాకపోతే నేను జ్యోతిష్యం ఆపేస్తానని కూడా సవాల్ విసిరాడు. అయితే లేటెస్టుగా డార్లింగ్ నటించిన సలార్ మూవీ హిట్ కావడంతో కథ అడ్డం తిరిగింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీ ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. రికార్డుల కలెక్షన్లతో థియేటర్లలో ఈ మూవీ పరుగులు పెడుతోంది. దీంతో వేణు స్వామిని ట్యాగ్ చేస్తూ నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. అనేక రకాల వేణు స్వామి మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే మాత్రం వేణు స్వామిని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ప్రభాస్ గురించి అవాకులు చవాకులు పేలావ్ ఇప్పుడే సలార్ మూవీ సూపర్ హిట్ అయింది దీనికి నీ ఆన్సర్ ఏంటని వేణు స్వామిని ట్యాగ్ చేసి మరీ అడేసుకుంటున్నారు. ఈ క్రమంలో మరోసారి వేణు స్వామి ఈ టాపిక్ పై స్పందించాడు. ప్రభాస్ విషయంలో తాను చెప్పింది కరెక్టేనని చెప్పుకొచ్చాడు. అంతే కాదు పుండు మీద కారం చల్లినట్లు ప్రభాస్ గురించి మరోసారి కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు.

venu-swamy-sensational-comments-on-prabhas

వేణు స్వామి ఈ విషయంపై స్పందిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు…” సూపర్ స్టార్ అంటే రిలీజ్ అయిన సినిమాల్లో 90% సినిమాలు హిట్లు కొట్టడం కానీ, రిలీజైన నాలుగు చిత్రాల్లో ఒక సినిమా హిట్టు కొడితే ఏమనాలి ? నాలుగు మూవీస్ కి ఒక సినిమా హిట్టు కొట్టడం కాదురా ఆజాము” అంటూ ఎవరో ఆస్ట్రేలియా వ్యక్తికి గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ టైం బాగోలేదని అంటేనే ఆయన అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు..అలాంటిది అసలు ప్రభాస్ సూపర్ స్టార్ కాదంటూ కామెంట్స్ చేసి మళ్ళీ ఫ్యాన్స్ ను రెచ్చగొట్టాడు. మరి ఈ విషయంపై ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే.

Sri Aruna Sri

Recent Posts

Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్..దర్శకుడెవరంటే!

Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…

3 days ago

Mythri Movie Makers: మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ఇన్ని సినిమాలా? ఇండస్ట్రీలో వీళ్ళేగా నంబర్ 1!

Mythri Movie Makers: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్. 2015లో…

1 week ago

Vishwambhara: జరిగిన పొరపాటును మేకర్స్ ఒప్పుకున్నారా!

Vishwambhara: విశ్వంభర..మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా. మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ళ తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ…

1 week ago

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్..సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్ చేసిన చిరంజీవి

Ram Charan-Upasana: రామ్ చరణ్, ఉపాసనలకు ట్విన్స్ పుట్టారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్…

1 week ago

Chiranjeevi: కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ కామెంట్స్ వైరల్.!

Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతటా వైరల్ అవుతున్నాయి. ఈ…

2 weeks ago

Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా ‘పెద్ది’..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది!

Peddi: మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా 'పెద్ది'..ఇది కదా మెగా ఫ్యాన్స్ ఊహించనిది..అవును మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్…

2 weeks ago

This website uses cookies.