Salaar : సలార్ సినిమా ఎడిటింగ్‌ ఇరగదీసింది ఈ కుర్రాడే

Salaar : సలార్ మొదటి భాగం బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులుపుతోంది. శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ మూవీ కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. మొదటి షో నుంచే బాక్సాఫీస్ దగ్గర ఊచకోత మొదలుపెట్టింది. విజనరీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ యాక్షన్ క్రియేషన్ కి అంతా ఫిదా అవుతున్నారు. ఒకే ఒక్క హిట్ కోసం ఐదేళ్ల నుంచి ఆకలితో ఉన్న ప్రభాస్ ఫాన్స్ ఎట్టకేలకు సలార్ తీర్చింది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కటౌట్ ని బాగా వాడిన సినిమా సలార్. పక్కా మాస్ క్యారెక్టర్ లో ప్రభాస్ ను చూసుకుని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. డార్లింగ్ కట్ అవుట్‎కి ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్స్ అద్భుతహా అని అంటున్నారు సినీ ప్రేమికులు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఈ మూవీ మొదటి రోజే వరల్డ్ వైడ్‎గా రూ.178.7 కోట్ల వసూళ్లను అందుకుంది. రెండో రోజూ సలార్ భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సంవత్సరం భారత మార్కెట్ టాప్ గ్రాసర్స్ గా మొదటి మూడు స్థానాల్లో జవాన్, పఠాన్, యానిమల్ సినిమాలు నిలిచాయి. ప్రస్తుతం సలార్ దూకుడు చూస్తుంటే ఈ మూడు సినిమాల కంటే అధికంగా వసూళ్లను రాబట్టి రికార్డ్ సెట్ చేసేలా ఉందని తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన షారుఖ్ జవాన్ సినిమా 1100 కోట్లకు పైగా కలెక్ట్ చేయగా, పఠాన్ 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది, ఈ మధ్యనే విడుదలైన డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ క్రియేషన్ యానిమల్ మూవీ 800 కోట్లకు పైగా కలెక్షన్స్ ని నమోదు చేసింది. ఇప్పుడు సలార్ తో ప్రభాస్ ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తాడో వేచి చూడాల్సిందే.

salaar-editing-done-by-telangana-youngster-ramagiri-vishnu

ఇదిలా ఉంటే ప్రస్తుతం సలార్‎కు సంబంధిం ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. సలార్ సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలో దూసుకెళ్తోంది. ప్రభాస్ యాక్టింగ్ కు అందరూ ఫిదా అవుతున్నారు. ప్రశాంత్ నీల్ క్రియేటివిటీకి సెల్యూట్ చేస్తున్నారు. కేజీఎఫ్ తో జనాలను కట్టిపడేసిన ప్రశాంత సలార్ తో అదే మ్యాజిక్ రిపీట్ చేశారు. ఈ సినిమాలోని ప్రతి ఎలిమెంట్ అందరిని ఆకట్టుకుంటోంది. సలార్ ను ఎడిట్ చేసిన టెక్నీషియన్స్ గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ మూవీలోని ప్రతి సీన్ ను అద్భుతమైన ఎడిటింగ్ అందించారు టెక్నీషియన్స్. సలార్ హిట్ అవ్వడానికి వారూ కారణమే. ఈ క్రమంలో ఆదిలాబాద్ కుర్రాడి పేరు ఇప్పుడు హైలెట్ అవుతోంది. సలార్ కు అసిస్టెంట్ ఎడిటర్ గా పని చేసి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

salaar-editing-done-by-telangana-youngster-ramagiri-vishnu

సినిమాలపై ఉన్న ఆసక్తే సినీ రంగంలోకి అడుగుపెట్టెలా చేసింది. పర్సనల్ గా ఓ కంప్యూటర్‌ కొనుగోలు చేసి యూట్యూబ్‌ సహాయంతో టెక్నిక్స్ నేర్చుకుని అసిస్టెంట్‌ ఎడిటర్‌గా రాణిస్తున్నాడు తెలంగాణకు చెందిన కుర్రాడు రామగిరి విష్ణు. అసిస్టెంట్ ఎడిటర్ అని తీసిపాడేయకండి అతడి టాలెంట్ కు డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఫిదా అయ్యాడు అందుకే ఏకంగా ప్రభాస్‌ సలార్‌ మూవీకి అసిస్టెంట్‌ ఎడిటర్‌గా తీసుకున్ానడు. తన కెరీర్ లోనే పెద్ద ఘనతను సాధించాడు. రామగిరి విష్ణు సొంతూరు ఆదిలాబాద్ జిల్లాలోని కడెం. పేరెంట్స్ శ్రీనివాస్‌-లత. విష్ణు తండ్రి దర్జీ పని చేస్తుంటారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. స్టూడెంట్ గా ఉంటూనే విష్ణు తనకెంతో ఇష్టమైన మూవీ ఫీల్డ్ లో రాణించాలని గట్టిగా డిసైడ్ అయ్యాడు. ఆ మక్కువతో ఎలాగైనా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని సామాజిక మాధ్యమాల ద్వార ఎడిటింగ్‌ లో టెక్నిక్స్ తెలుసుకున్నాడు. తాను నేర్చుకున్న నైపుణ్యంతో వీడియోలను ఎడిట్ చేసి డైరెక్టర్లకు పంపించేవాడు. ఈ క్రమంలో సలార్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ విష్ణుకు ఛాన్స్ ఇవ్వడంతో సలార్ లో వర్క్ చేసే అవకాశం తక్కించుకున్ానడు. ఫస్ట్ మూవీనే అగ్రహీరోతో, అగ్ర డైరెక్టర్ సినిమాకు అసిస్టెంట్‌ ఎడిటర్‌గా పనిచేసి రాణించడంతో ఈ కుర్రాడి క్రియేటివిటీకి అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. గతంలో కల్యాణ్‌ డైరెక్షన్ లో రిలీజైన మ్యాడ్‌ మూవీకి విష్ణు వర్క్ చేశాడు. ప్రస్తుతం గ్యాంగ్‌ ఆఫ్‌ గోదావరి, లక్కీ భాస్కర్‌ మూవీస్ కి కూడా అసిస్టెంట్‌ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందినా విష్ణు సొంతంగా ఎడిటింగ్ నేర్చుకుని సినీ ఫీల్డ్ లోకి వెళ్లడంతో అతడి ఫ్రెండ్స్ , కడెం వాసులు అభినందిస్తున్నారు.

Sri Aruna Sri

Recent Posts

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 day ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 day ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

5 days ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

5 days ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

6 days ago

Aja Ekadashi 2026: రేపే అజ ఏకాదశి.. ఈ పరిహారాలు చేస్తే విష్ణు దేవుడి అనుగ్రహం మీపైనే?

Aja Ekadashi 2026: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం శ్రావణ మాసానికి ఎంతో మంచి ప్రత్యేకత ఉంది. ఈ శ్రావణ…

6 days ago

This website uses cookies.