Thu. Jan 22nd, 2026

    Venkatesh: దగ్గుబాటి ఇంట మరికొన్ని రోజుల్లో పెళ్లి భాజాలు మోగనున్నాయని తాజా సమాచారం. టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ రెండవ కుమార్తె హయవాహిని పెళ్లి నిశ్చయమైంది. రేపు(25.10.2023) నిశ్చితార్థం జరగనుంది. ఇప్పటికే వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత పెళ్లి అయిన సంగతి అందరికీ తెలిసిందే. కరోనా సమయంలోనే దగ్గుబాటి రానా పెళ్లి కూడా జరిగింది. ఇప్పుడు దగ్గుబాటి వారి ఇంట మరో పెళ్లి వేడుక జరగబోతోంది.

    వెంకీ తన కూతుళ్ళని ఇండస్ట్రీకి దూరంగా పెట్టారు. సినిమాలను చూస్తారు గానీ, తండ్రి హీరో కాబట్టి మేము కూడా ఇండస్ట్రీలోకి రావాలనే ఆలోచన కలగలేదు. ఇప్పటి వరకూ వెంకీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి కాంట్రవర్సీ న్యూస్ లు బయటకి రాలేదు. వెంకీ ఎంత డీసెంట్ గా ఉంటారో ఆయన భార్య, కూతుర్లు కూడా అంతే. రానా పెళి తర్వాత వెంకీ రెండో కూతురు పెళ్లి పనులు మొదలవబోతుండటంతో ఆ ఇంట సందడి వాతావరణం నెలకొంది.

    venkatesh-second daughter is getting married in a few hours.. do you know who is coming or not..?
    venkatesh-second daughter is getting married in a few hours.. do you know who is coming or not..?

    Venkatesh: సమంత వస్తుందా లేదా అనేది తెలియలేదు.

    ఇక ఈ వేడుకకి టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు సౌత్ లోని మిగతా ఇండస్ట్రీ ప్రముఖులు, బాలీవుడ్ ప్రముఖులు హాజరవనున్నారని సమాచారం. ఇంకా వివాహం ఎక్కడ జరగనుందనే విషయం గోప్యంగా ఉంది. ఈ వేడుకకి ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీ మొత్తం హాజరవనున్నట్టు తెలుస్తోంది. అయితే, సమంత వస్తుందా లేదా అనేది తెలియలేదు.

    కాగా, వెంకటేశ్ నటించిన సైంధవ్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎంతో సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ వెళుతున్నారు వెంకీ. ఆయన కొత్త సినిమాలు ప్రకటించాల్సి ఉంది. త్రివిక్రం శ్రీనివాస్, పూరి జగన్నద్ ల దర్శకత్వంలో వెంకీ సినిమా చేయనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. త్వరలో వెంకీ కొత్త ప్రాజెక్ట్ కి సంబధించిన న్యూస్ కూడా రానుంది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.