Vastu Tips: మన దేశంలో దేవతలతో పాటు కొన్ని చెట్లను కూడా పూజిస్తారు. అలా పూజించే చెట్లలో వేప చెట్లు కూడా ఒకటి. మన దేశంలో వేప చెట్టుని దైవంతో సమానంగా భావించి పూజిస్తారు. ఎంతో విశిష్టత ఉన్న ఈ వేప చెప్పు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రోగాల నివారణలో వేప ఆకులను అయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. అంతే కాకుండా వేప చెట్టు నుండి వచ్చే గాలి ఆరోగ్యానికి మంచిదని కొందరు ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా వేప చెట్లు పెంచుతుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం వేపచెట్టు మన ఇంట్లో ఏ దిక్కున ఉంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు దోష నివారణలో వేపచెట్టు ఎంతో ఉపయోగపడుతుంది. అయితే వేప చెట్టుని ఇంట్లో పెంచడం వల్ల అశుభ ఫలితాలను ఇస్తుందని కొంత మంది వాస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే అలా చెప్పటానికి కారణం కూడా ఉంది. వేపచెట్టు పెరిగి పెద్దయి మహావృక్షం అవుతుంది. ఇంటి పరిసర ప్రాంతాల్లో వేప చెట్టు పెంచితే దాని వేళ్ళు ఇంటి పునాది లోపలి వ్యాపించినప్పుడు ఇంటి గోడలు దెబ్బ తింటాయి. అయితే ఇలా చీలిన గోడలు ఇంటికి
ఆశుభాన్ని తీసుకొస్తాయి. కాబట్టి ఇంట్లో ఎవరూ వేప చెట్టును పెంచకూడదని చెబుతూ ఉంటారు.
Vastu Tips:
ఒకవేళ వేప చెట్టును పెంచాలనుకునే వారు ఇంటికి కొంచం దూరంగా కాంపౌండ్ వాల్ బయట రోడ్డుపైన పెంచితే మంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా ఇంటికి దక్షిణాదిశలోనే వేప చెట్టుని పెంచాలని, లేదంటే పశ్చిమ దిశలో పెంచాలని చెబుతున్నారు. అయితే ఇంటికి తూర్పు దిశలో వేప చెట్టు ఉండడం వల్ల వాస్తు దోషం ఏర్పడి ఆ ఇంట్లో సమస్యలు తలెత్తుతాయి. అంతే కాకుండా చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి. ఈ వాస్తు దోషం తొలగిపోవాలంటే తూర్పు దిశలో ఉన్న వేప చెట్టుకి గురు, శుక్ర వారాల్లో పూజలు చేయాలి. అంతేకాకుండా ఆ వేప చెట్టుకి 108 పసుపు ధారాలను చుట్టి పూజించాలి.