Spirituality: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజ చేస్తూ ఉంటాము. ఇలా ఉదయం సాయంత్రం పూజ చేయటం వల్ల ఇంట్లో ఎంతో ప్రశాంతత ఉండటమే కాకుండా ఇంట్లో కూడా ఎలాంటి నెగటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అందుకే ఉదయం లేదా సాయంత్రం పూజ చేస్తూ ఉంటాము అయితే పూజ చేసే సమయంలో మనం ఎటువైపు తిరిగి పూజ చేయాలి అనే సందేహం చాలా మందికి కలిగి ఉంటుంది. అదే విధంగా చాలామంది వ్రతాలు నోములు చేసేటప్పుడు కూడా ఎటువైపు తిరిగే కూర్చొని పూజలు చేయాలి అనే విషయానికి వస్తే…
వాస్తు శాస్త్రం ప్రకారం పూజ చేసేటప్పుడు మీ ముఖం తూర్పు లేదా ఉత్తర దిశలో ఉండేలా చూసుకోవాలి.ఎందుకంటే వాస్తు ప్రకారం ఈ దిశను సానుకూల శక్తికి ప్రవేశ ద్వారంగా భావిస్తారు. అందుకే పూజ చేసేటప్పుడు మీరు ఈ దిశలో ఉండి దేవుడిని పూజిస్తే ఎన్నో రెట్లు ఫలితాలను పొందవచ్చట. అంతేకాకుండా తూర్పు దిక్కున ముఖం పెట్టి పూజించడాన్ని శుభంగా పరిగణిస్తారు. ఇక ఉత్తర దిశ అనేది కుబేర దిశ. అదేవిధంగా లక్ష్మీస్థానం కూడా ఉత్తర దిశ కావడంతో ఉత్తరం దిశవైపు తిరిగి పూజ చేయడం వల్ల సంపద కలుగుతుందని భావిస్తారు.
ఉత్తరం దిక్కు ముఖం పెట్టి అమ్మవారిని పూజిస్తే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు. ఇలా చేస్తే సిరి సంపదలు కూడా కలుగుతాయట. లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు లక్ష్మీదేవి మంత్రాలను పఠించాలని చెబుతున్నారు. ఇక ఇంట్లో పూజ మందిరం నిర్మించుకునేటప్పుడు పూజ మందిరం తలుపులు కుడి వైపు ఉండేలా చూసుకోవటం కూడా ఎంతో మంచిది ఇలాంటి నియమాలను పాటించి పూజ చేయడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.