Ganesh: త్వరలోనే వినాయక చవితి పండుగ రాబోతోంది ఇప్పటికే వినాయక చవితి పండుగ హడావిడి మొదలైందనే విషయం మనకు తెలిసిందే. ఎక్కడ చూసినా మనకు వినాయకుడి ప్రతిమలు దర్శనమిస్తున్నాయి అయితే వినాయక చవితి పండుగ రోజు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఈ పండుగను విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకునేవారు ఎలాంటి విగ్రహం ఏర్పాటు చేస్తే మంచిది. ఈ విగ్రహాన్ని ఏ వైపు ఉంచాలి అనే విషయాలు తెలియక ఇబ్బంది పడుతుంటారు.
చాలామంది వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వారికి ఇంట్లో అనుకూలంగా ఉన్న ప్రదేశంలో మాత్రమే విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజిస్తుంటారు అయితే ఇలా అనుకూలంగా ఉన్న చోట కాకుండా వినాయకుడి విగ్రహాన్ని సరైన దిశలో ఉంచి పూజ చేసినప్పుడు అద్భుతమైన ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. మరి వినాయకుడి ప్రతిమ ఏ దిశలో ఉండాలి ఏ దిశలో ఉండడం వల్ల మంచి జరుగుతుంది ఎలాంటి నాయకుడిని ప్రతిష్టించాలి అనే విషయానికి వస్తే…
ఇంట్లో వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేయాల్సి వస్తే తెలుపు రంగు వినాయకుడిని ఏర్పాటు చేయడం ఎంతో మంచిది ఈ తెలుపు రంగు వినాయకుడిని శ్వేతార్కర వినాయకుడు అని కూడా పిలుస్తారు. ఇలా తెలుపు రంగు వినాయకుడు ప్రతిమను ప్రతిష్టించడం వల్ల ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా ఇంట్లో వారందరూ కూడా సంతోషాలతో ఉండడమే కాకుండా అనుకున్న పనులన్నీ కూడా సవ్యంగా కొనసాగుతాయి. ఇక పసుపుతో తయారు చేసినటువంటి వినాయకుడిని పూజించడం ఎంతో శుభప్రదం. ఇకపోతే ఇంట్లో వినాయకుడి ప్రతిమను ఎప్పుడు కూడా తూర్పు లేదా పడమర వైపు మాత్రమే ప్రతిష్టించాలి. అలా కాకుండా బాత్రూం అటాచ్ అయినటువంటి గోడకు ఎప్పుడు కూడా ప్రతిష్టించకూడదు దక్షిణ మూలలో కూడా ప్రతిష్టించకూడదు ఇక మెట్ల కింద భాగంలో ఖాళీగా ఉంటుందని చాలా మంది అక్కడ కూడా వినాయకుడి ప్రతిష్ట చేస్తారు.ఇలా ఎప్పుడూ కూడా చేయకూడదు.