Vastu Tips: సాధారణంగా మనం ఎన్నో రకాల జంతువులను పక్షులను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాము. ఇలా ఇంట్లో జంతువులు పక్షులను పెంచుకోవడం వల్ల ఎంతో మానసిక ప్రశాంతత ఉంటుందని భావిస్తూ ఉంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల పక్షులు జంతువులను ఇంట్లో పెంచుకోవడం మంచిది కాదని చెబుతుంటారు. అయితే వాస్తు ప్రకారం ఇంట్లో రామచిలుకను పెంచుకోవడం మంచిదేనా చిలుకను పెంచుకోవడం వల్ల ఏ విధమైన ఇబ్బందులు ఉండవా అనే సందేహాలు అందరిలోనూ ఉంటాయి.
వాస్తు ప్రకారం ఇంట్లో చిలుకను పెంచుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఏంటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..వాస్తు ప్రకారం ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో రామ చిలుకను ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇక రామ చిలుకను మనం పంజరంలో కనుక పెంచినట్లు అయితే పంజరంలో పెరుగుతున్న చిలుక ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూసుకోవాలి లేదంటే మనపై ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది.
ఇంట్లో రామ చిలుక బొమ్మను ఉంచడం కూడా చాలా శ్రేయస్కరం. ఇది జాతకంలో ఉన్న గ్రహ దోషాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.ఇంట్లో చిలుకను ఉంచడం వల్ల రాహు-కేతు, శని గ్రహాల దుష్ప్రభావాలు తగ్గుతాయని నమ్ముతారు.రామ చిలుక సంతోషంగా లేని పక్షంలో ఇంట్లో తరచుగా ఇంట్లో ఇబ్బందులు తలెత్తుతాయని నమ్ముతారు. ఎప్పుడైతే చిలుక ఇంట్లో సంతోషంగా ఉండదో ఆ క్షణం నుంచి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తాయి. అందుకే ఇంట్లో చిలుకను పెంచినట్లు అయితే అది ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకోవాలి వీలైనంత వరకు పంజరంలో కాకుండా ఇంట్లో తిరుగుతూ ఉండేలా చూసుకోవడం మంచిది.