Vastu Tips: మన భారతీయ ప్రజలకు సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఇప్పటికీ ఎంతో అపారమైన నమ్మకం గౌరవం ఉన్నాయి. అయితే కొంతమంది ప్రజలు వాటిని మూఢనమ్మకాలుగా కొట్టి పారేస్తుంటారు. అయితే పూర్వం మన పెద్దలు చెప్పిన శాస్త్రాలు పాటించటం వల్ల మనకు మేలు జరుగుతుంది. ఇదిలా ఉండగా కొన్ని సందర్భాలలో అప్పుడప్పుడు గోడ మీద ఉన్న బల్లి మన మీద పడుతుంటాయి. అలా బల్లి పడటం అనేది మన జీవితంలో జరగబోయే సంఘటనల గురించి తెలిపే సంకేతంగా భావిస్తారు. బల్లి శాస్త్రం ప్రకారం శరీరం మీద ఏ ప్రదేశంలో బల్లి పడితే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా మహిళల శరీరం మీద బల్లి పడితే వారి జీవితంలో ఏదో ముఖ్యమైన సంఘటన జరగబోతోందని అర్థం. బల్లి శాస్త్రం ప్రకారం.. మహిళల శరీరంలో ఏ ప్రదేశంలో బల్లి పడితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.
• బల్లి శాస్త్రం ప్రకారం ఆడవారి కుడి చెంపపై బల్లి పడటం శుభ పరిణామంగా భావించవచ్చు. మహిళల కుడి చెంప పై బల్లి పడితే వారికి మగసంతానం కలుగుతుంది అని అర్థం.
• అలాగే మహిళల కుడి చెవి మీద బల్లి పడటం కూడా శుభసంకేతంగా పరిగణించవచ్చు. ఇలా మహిళ కుడిచెవి మీద బల్లి పడటం వల్ల ధనలాభం కలుగుతుందని అర్థం.
Vastu Tips:
• అయితే మహిళలకు పై పెదవిపై బల్లి పడితే చెడు పరిణామంగా పరిగణించాలి. ఎందుకంటే ఇలా జరగటం వల్ల కుటుంబంలో భార్యాభర్తల కుటుంబ సభ్యుల మధ్య విరోధములు కలుగుతాయి.
• అలాగే కింది పెదవిపై బల్లి పడటం అనేది మనం భవిష్యత్తులో కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉన్నదని తెలిపే సంకేతం.
• అలాగే మహిళల వీపు పై బల్లి పడటం చెడు పరిణామాలు జరగబోతున్నాయని తెలిపే సంకేతం. ఇలా జరిగితే మరణ వార్త వినే అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీల తలపై బల్లి పడినా కూడా మరణ వార్త వినవలసి వస్తుంది.