Vastu Tips: ప్రస్తుత కాలంలో చాలామంది మన ఆచార సాంప్రదాయాలను పాటిస్తున్నప్పటికీ వాస్తు శాస్త్రాన్ని మాత్రం చాలా నమ్ముతూ ఉంటారు. వాస్తు ప్రకారం ప్రతి పనిని చేస్తూ ఉంటారు. ఇంట్లో ఏ అలంకరణ వస్తువులు పెట్టాలన్న లేకపోతే ఇంటి నిర్మాణ పనులు చేపడుతున్న కూడా వాస్తును దృష్టిలో ఉంచుకొని అదేవిధంగా ఇంటి నిర్మాణాన్ని ఇంటిలో వస్తువులను అలంకరించుకుంటూ ఉంటారు.అయితే ఇంటి ప్రధాన ద్వారం ముందు చాలా మంది చాలా ఆహ్లాదకరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే గోడకు దేవుడు టైల్స్ అతికిస్తూ ఉంటారు.
ఈ విధంగా ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇలా దేవుడి ఫోటోలు ఉన్నప్పటికీ ఇంటి లోపల ప్రధాన ద్వారం ఎదురుగా కూడా చాలామంది కొన్ని ఫోటోలను అతికిస్తూ ఉంటారు.అయితే కొందరు దేవుళ్ళ ఫోటోలను అతికించుకోగా మరికొందరు వివిధ రకాల ఫోటోలు అతికిస్తారు. అయితే పొరపాటున కూడా ఇంటి గుమ్మానికి ఎదురుగా లోపలి వైపు చనిపోయిన వారి ఫోటోలను మాత్రం పెట్టకూడదు. ఇలా పెట్టడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అందుకే చనిపోయిన వారి ఫోటోలు కనుక ఉంటే తీసేయడం మంచిది.
Vastu Tips:
ఇకపోతే ఇంటి ప్రధాన గుమ్మానికి ఎదురుగా వినాయకుడి చిత్రపటం పెట్టడం శుభసంకేతం.ఇలా వినాయకుడి చిత్రపటాన్ని కనుక ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా పెట్టడం వల్ల మన ఇంటి పైన నర దృష్టిపడిన ఆ ప్రభావం ఇంట్లో వారిపై ఉండకుండా ఉంటుంది. అలాగే ఇల్లు మొత్తం పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడతాయి. అందుకే ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా మనం గుమ్మంలోకి అడుగుపెట్టగానే వినాయకుడు కనిపించేలా పెట్టుకోవడం ఎంతో మంచిది. ఇలా చేయడం వల్ల ఆ ఇంటిపై నరదృష్టి నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదు.