Pregnant Women: మహిళలు గర్భం దాల్చిన మొదటి నెల నుంచి కూడా డెలివరీ అయ్యే వరకు తమ ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా జాగ్రత్తలు తీసుకున్నప్పుడే కడుపులో బిడ్డ ఎదుగుదల ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. అయితే చాలామంది ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి మహిళలు రాత్రిపూట నిద్ర పట్టకపోవడం వల్ల ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు.ఇలా వారు ఇబ్బంది పడటానికి వారు చేసే కొన్ని తప్పులే కారణమని తెలుస్తుంది. మరి రాత్రి సమయంలో నిద్ర పట్టకపోవడానికి కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే…
చాలామంది మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువగా కాఫీ తాగడానికి ఇష్టపడతారు. అయితే ఇలా కాఫీ తాగటం వల్ల అందులో ఉన్నటువంటి కెఫెన్ నిద్ర భంగం కలిగిస్తుంది. అందుకే రాత్రిపూట సరిగా నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటారు.అందుకే మహిళలు తప్పనిసరిగా ప్రెగ్నెన్సీ సమయంలో కాఫీ పూర్తిగా తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు. ఇక చాలామందికి ఫుడ్ క్రేవింగ్స్ ఉండటం వల్ల మసాలా ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. ఇలా మసాలా ఫుడ్స్ తినడం వల్ల గ్యాస్టిక్ ప్రాబ్లం వల్ల నిద్ర పట్టదు.
Pregnant Women:
ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు చాలా తక్కువగా ఈ మసాలాలు తినడం ఎంతో మంచిది.ఇక నెలలు నుండి కొద్దీ పొట్ట పెరుగుతుంది దాంతో పడుకోవడానికి ఎంతో ఇబ్బంది పడతారు అలాంటి సమయంలో తప్పనిసరిగా ప్రెగ్నెన్సీకి కొనుగోలు చేయడం వల్ల ప్రశాంతమైన నిద్ర కలుగుతుంది. ఇక చాలామంది పగలు నిద్రపోవటం వల్ల రాత్రిలో నిద్ర పట్టడానికి ఇబ్బంది పడుతుంటారు. అందుకే పగలు కాస్త నిద్ర తగ్గించుకోవడం ఎంతో మంచిది. ప్రెగ్నెన్సీ మహిళలు ఈ విధమైనటువంటి జాగ్రత్తలు కనుక పాటిస్తే రాత్రి సమయంలో ప్రశాంతంగా నిద్రపోవచ్చు.