Devotional Tips: హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం పూజ చేయడం వల్ల ఎంతో శుభ ఫలితాలు కలుగుతాయని భావిస్తారు. ఇలా పూజ చేయడం వల్ల మనసు ఎంతో ప్రశాంతంగా ఉండటమే కాకుండా ఇంట్లో కూడా ఏ విధమైనటువంటి కళతలు లేకుండా సంతోషంగా ఆనందంగా ఉంటారు అయితే పూజ చేసే సమయంలో పూజ విషయంలో మనం అలాగే పూజ గది విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం.
పూజ చేసేటప్పుడు ఎల్లప్పుడూ కూడా దేవుడి విగ్రహాలు తూర్పు వైపుకు ఉండి మొహం పడమర దిశగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకపోతే మన ఇంట్లో పూజ చేసే సమయంలో కొన్ని వస్తువులు తప్పనిసరిగా ఉండాలి అలాంటి వాటిలో శంకు శాలి గ్రామం నెమలి పించం వంటివి ప్రధానంగా ఉండాలి. ఇది ఇంట్లో కనుక ఉంటే ఎన్నో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవని పండితులు చెబుతున్నారు.
ఇక ఇంట్లో విగ్రహారాధన చేయడం ఎంతో మంచిది అయితే ఎక్కువ ఎత్తు ఉన్నటువంటి విగ్రహాలను తీసుకురాకూడదు. ఒక అంగుళం ఇంచు ఉన్నటువంటి విగ్రహాలను పెట్టి పూజ చేయడం వల్ల అంత శుభం కలుగుతుంది. ఒకవేళ పెద్ద విగ్రహాలు కనుక ఉంటే తప్పనిసరిగా మనం ప్రతిరోజు అభిషేకాలు అర్చనలు నైవేద్యాలు చేయవలసి ఉంటుంది కనుక ఎత్తైనటువంటి విగ్రహాలను ఇంట్లో ఎప్పుడు పెట్టకూడదు. అయితే పూజ గదిలో మాత్రం ఈ వస్తువులు ఉండటం వల్ల శుభ పరిణామాలు కలుగుతాయని చెప్పాలి.