ప్రస్తుతం యంగ్ హీరోలు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే రానా, నిఖిల్ లాంటి హీరోలు పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. ఇక తాజాగా యువ హీరో శర్వానంద్ కూడా నిశ్చితార్ధం చేసుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్ పెళ్లి గురించి కూడా క్లారిటీ వస్తుంది. ఈ ఏడాదిలోనే ప్రభాస్ పెళ్లి చేసుకునే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. ఇక వీరి జాబితాలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్స్ గా వరుణ్ తేజ్, సాయి తేజ్ ఉన్నారు. అయితే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్నాడనే టాక్ గతంలో వచ్చింది. లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీ వేడుకలలో పాల్గొనడం కూడా దీనికి కారణం అయ్యింది. అయితే ఆ రూమర్స్ కి వారు ఫుల్ స్టాప్ పెట్టారు.
ఇక సాయి ధరమ్ తేజ్ కూడా బాలీవుడ్ నటిగా ప్రేమలో ఉన్నాడనే మాట వినిపిస్తుంది. తేజ్ తో తిక్కా సినిమాలో నటించిన భామతో అతను ప్రేమలో ఉన్నాడని టాక్. ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ పెళ్లి గురించి తాజాగా నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రెండు సినిమాలతో వరుణ్ తేజ్ బిజీగా ఉన్నాడు. అయితే ఇవి పూర్తయిన తర్వాత కాని, లేదంటే ఈ ఏడాదిలోనే వరుణ్ తేజ్ పెళ్లి జరిగే ఛాన్స్ ఉందని నాగబాబు క్లారిటీ ఇచ్చారు.
అలాగే పెళ్లి తఃర్వత వరుణ్ తేజ్ భార్యతో కలిసి వేరు కాపురం పెడతారని, తమతో కలిసి ఉండరని చెప్పుకొచ్చారు. దీనిని బట్టి వరుణ్ తేజ్ పెళ్లికి సంబందించి ఇప్పుడు మెగా ఫ్యామిలీ దృష్టిపెట్టినట్లు తెలుస్తుంది. సంబంధాలు కూడా చూస్తున్నారనే మాట వినిపిస్తుంది. మరి వరుణ్ తేజ్ పరిణయం ఆడబోయే ఆ అమ్మాయి ఎవరై ఉంటారా అనేది సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.