టాలీవుడ్ లో చిరుత సినిమాతో అడుగుపెట్టిన బాలీవుడ్ భామ నేహా శర్మ. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే అటు నటిగా మంచి మార్కులు కొట్టేసింది. అలాగే తన అందాలతో ప్రేక్షకులని ఫిదా చేసింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి 15 ఏళ్ళు అవుతుంది. ఇన్నేళ్ళలో నేహా శర్మ కెరియర్ పరంగా పెద్దగా స్టార్ హీరోయిన్ ఇమేజ్ ని అయితే అందుకోలేదు కాని బాలీవుడ్ లో అలాగే పంజాబీ సినిమాలలో అవకాశాలు అందుకుంటూ లైమ్ లైట్ లోనే ఉంది. తెలుగులో చివరిగా ఆమె వరుణ్ సందేశ్ కుర్రాడు సినిమాలో నటించింది. ఈ మూవీ డిజాస్టర్ కావడంతో తరువాత కనిపించకుండా పోయింది.
పూరి జగన్నాథ్ పరిచయం చేసిన హీరోయిన్స్ లో పెద్దగా సక్సెస్ కాని వారిలో నేహా శర్మ కూడా ఒకరని చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ అమ్మడు సినిమాలలో కంటే సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. దానికి కారణం ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈమె చేసే అందాల ప్రదర్శన అని చెప్పాలి. శరీరంలోని అందాలు అన్ని కనిపించే విధంగా ఈమె కాస్ట్యూమ్స్ వేస్తూ కుర్రాళ్ళకి నిద్ర లేకుండా చేస్తుంది. ఆమె హాట్ సోయగాలకి ఇన్స్టాగ్రామ్ లో విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు.
ఇదిలా ఉంటే ఈ అమ్మడుకి ఇప్పుడు చెల్లి కూడా తోడైంది. అయిషా శర్మ. మోడలింగ్ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ సత్యమేవ జయతే అనే సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఇక అక్కని మించిపోయే విధంగా ఆమె కూడా అందాల ప్రదర్శనలో హద్దులు దాటిపోతుంది. ఇక ఈ మధ్య ఇద్దరూ కలిసి సోషల్ మీడియాలో హాట్ హాట్ కాస్ట్యూమ్స్ తో అందాల ప్రదర్శన చేస్తూ అందరికి వినోదాన్ని అందిస్తున్నారు. తాజాగా వీరిద్దరూ స్కర్ట్స్ బికినీ షూట్ లో స్విమ్మింగ్ పూల్ పక్కన నిలబడి ఓ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.