Varunlav : టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా సొట్టచెంపల చిన్నది లావణ్య త్రిపాఠి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రొఫెషనల్ లైఫ్ లో సక్సెస్ సాధించడమే కాదు పర్సనల్ లైఫ్ లోనూ ఈ భామ విజయం సాధించిందని చెప్పాలి. ఐదేళ్ల పాటు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో ప్రేమాయణం కొనసాగించి నవంబరు 1 న ఇటలీలో పెళ్లి చేసుకుంది. మెగా ఫ్యామిలీ లావణ్య ఫ్యామిలీ సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు ఈ కపుల్స్. ఇటలీలో నాలుగు రోజులు పాటు జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో మెగా ఫ్యామిలీకి చెందిన స్టార్ సెలబ్రిటీలు సందడి చేశారు. పెళ్లి తర్వాత హైదరాబాదులో నవంబర్ 5న గ్రాండ్ గా రిసెప్షన్ అరేంజ్ చేశారు. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులందరూ హాజరయ్యారు. మెగా ఫ్యాన్స్ ఇప్పటికి వరుణ్ లావణ్య ల పెళ్లి, రిసెప్షన్ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ఇక పెళ్లి పనులన్నీ పూర్తి కావడంతో లావణ్య వరుణ్ తేజ్ ఇద్దరు హనీమూన్ కి వెళ్తారని మెగా ఫాన్స్ భావించారు కాకపోతే సీన్ రివర్స్ అయ్యింది. పెళ్లి జరిగి పట్టుమని పది రోజులు కూడా కాలేదు లావణ్య కు పెద్ద షాకే తగిలింది. పాపం లావణ్యను వదిలిపెట్టి వరుణ్ వర్క్ బిజీ లో పడిపోయాడని టాక్ వినిపిస్తోంది. భార్య కంటే సినిమాలే ఎక్కువనుకున్నాడో ఎమో తన సినిమా ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిసైడ్ అయ్యాడట. అందుకోసమే పెళ్లయిన వారానికే షూటింగ్ అంటూ పరుగులు తీస్తున్నాడట.
వరుణ్ తేజ్ చేతిలో ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకటి మట్కా. మరొకటి ఆపరేషన్ వాలెంటైన్.ఇందులో ఆపరేషన్ వాలెంటైన్ మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ స్ఫూర్తితో తెలుగు, హిందీ లో రూపుదిద్దుకుంటున్న ప్రాజెక్ట్ ఇది. ఈ వరుణ్ ఈ మూవీ లో పైలెట్‌గా కనిపించనున్నాడు. ప్రజెంట్ ముంబయిలో ఈ మూవీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ మూవీ కోసమే వరుణ్ ముంబయికి వెళ్తూ.. ఎయిర్‌పోర్ట్‌లో తలుక్కుమన్నాడు . ‘‘కొత్త పెళ్ళికొడుకైన వరుణ్ భార్యతో హనీమూన్ వెళ్లకుండా.. పెళ్లైనా వారానికి సినిమా షూటింగ్ బిజీలో పడిపోయాడుగా..భార్య కంటే సినిమాలే ఎక్కువనా అంటూ నిటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
Kalki 2898 AD Sequel:సైలెంట్‌గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్‌లో అమితాబ్, ప్రభాస్! అవును..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్…
Puranapanda Srinivas: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ…
This website uses cookies.