Categories: Health

Seasonal Fruits: వేసవిలో అరుదుగా దొరికే సీమ చింతకాయలు.. తింటే కలిగే ప్రయోజనాలు తెలుసా?

Seasonal Fruits: ఈ రోజుల్లో చాలామందికి తెలియకపోవచ్చు గాని ఒకప్పుడు సీమ చింతకాయలు అంటే ఇష్టపడని వారు తెలియని వారు అంటూ ఉండరు. ఈ రోజుల్లో మనం పిజ్జా, బర్గర్, నూడిల్స్ వంటి జంక్ ఫుడ్ కు అలవాటు పడి ఇలాంటి సహజ సిద్ధంగా లభించే కాయలను ఎప్పుడో మర్చిపోయాం. పల్లె వాసులకు సుపరిచితమైన సీమ చింతకాయలు తెలుపు గులాబీ రంగు కలయికతో తీపి వగరు రుచుల కలయికతో తినడానికి అద్భుతంగా ఉంటుంది. సీమ చింత చెట్లు అత్యధిక ముళ్ళు కలిగి పొలం గట్లు చెరువులు అటవీ ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. వేసవి సీజన్ లో మాత్రమే కాయలు పక్వానికి వచ్చి తినడానికి సమృద్ధిగా లభిస్తాయి.

సహజ సిద్ధంగా లభించే సీమ చింతకాయలో ఉన్న ఔషధ గుణాలు పోషక విలువలు మన ఆరోగ్యాన్ని రక్షించడంలో కూడా సహాయపడతాయి. ముఖ్యంగా బాగా పండిన సీమ చింతకాయలు విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి, ఫైబర్, కాల్షియం,ఫాస్ఫరస్, యాంటీ ఆక్సిడెంట్లు సోడియం వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి సీజన్లో దొరికే ఈ కాయలను మన ఆహారంలో తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది.

ఈ కాయల్లో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది. వీటిని ఆహారంగా తీసుకుంటే ఎర్ర రక్త కణాల వృద్ధి జరిగి రక్తహీనత సమస్యను కూడా దూరం చేస్తుంది. సీమ చింత ఆకులు కొమ్మల్లో కూడా ఔషధ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. డయేరియా సమస్యతో బాధపడేవారు ఈ ఆకులను కొమ్మలను నీటిలో మరిగించి వచ్చిన కషాయాన్ని సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది. సీమ చింతకాయల్లో పుష్కలంగా ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి మెదడు చురుకుదనాన్ని పెంచి జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుందని అనేక అధ్యయనాల్లో స్పష్టమైంది.

Sravani

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

4 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

6 days ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

6 days ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

1 week ago

This website uses cookies.