Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా, దర్శకుడు హరీశ్ శంకర్ సినిమాకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకున్నారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి పనిచేస్తున్న తాజా షెడ్యూల్ విజయవంతంగా పూర్తయిందని ఆయన వెల్లడించారు.
షెడ్యూల్ పూర్తి అయిన సందర్భంగా దర్శకుడు హరీశ్ శంకర్ తన సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్‌తో కలిసి దిగిన ఒక ప్రత్యేకమైన ఫోటోను పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ సింపుల్ లుక్‌లో కనిపించడంతో అది అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ పోస్ట్‌లో హరీశ్ శంకర్ పవన్‌పై ప్రశంసలు కురిపిస్తూ, “మాటిస్తే నిలబెట్టుకోవడం, మాట మీదే నిలబడడం… మీరు పక్కన ఉంటే కరెంట్ పాకినట్లే ఉంటుంది” అని రాశారు. ఈ రోజును తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని, పవన్ కళ్యాణ్ ఎనర్జీ సినిమాకు మరింత పవర్ ఇచ్చిందని ఆయన తెలిపారు. పవన్ సపోర్ట్ వల్లే ఈ షెడ్యూల్ వేగంగా పూర్తయిందని హరీశ్ శంకర్ అన్నారు.

Ustaad Bhagat Singh: పోలీస్ అధికారి పాత్రలో పవన్ కళ్యాణ్
‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక పోలీస్ అధికారి పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన సరసన యువ నటి శ్రీలీల మరియు రాశీ ఖన్నా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రఖ్యాత సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’ (OG) షూటింగ్‌లో కూడా బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు కూడా త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక మరోవైపు సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజి తాజాగా వచ్చిన ఫస్ట్ సాంగ్‌తో యూట్యూబ్ నే షేక్ చేసేస్తోంది. గతంలో ఏ తెలుగు సినిమాలోని పాటకి రానటువంటి లైక్స్ ఓజాస్ గంభీరా కి రావడం షాకింగ్ విషయం. ఇది చూస్తే అర్థం అవుతోంది. ఓజి మేనియా ఏ రేంజ్‌లో ఉండబోతుందో.

