Turtle Ring: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతి ఒక్కరూ మన ఆచార వ్యవహారాలను పాటించడమే కాకుండా వాస్తు పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటారు.ఈ విధంగా చాలామంది ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి అలాగే అనుకున్న పనులు నెరవేరడానికి వివిధ రకాల వాస్తు పరిహారాలను పాటిస్తూ ఉంటారు. ఈ విధంగా చాలామంది పాటించే పరిహారాలలో తాబేలు ఉంగరాన్ని ధరించడం. తాబేలు ఉంగరం ధరించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉండవని భావిస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే చాలామంది తాబేలు ఉంగరాన్ని తమ చేతికి ధరించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని భావిస్తారు. అయితే ఈ తాబేలు ఉంగరాన్ని ధరించడం వల్ల అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి కానీ వాటిని సరైన విధంగా ధరించడం ఎంతో ముఖ్యం. ఇక ఈ తాబేలు ఉంగరాన్ని ఫలానా వారే ధరించాలని నియమ నిబంధనలు ఏమీ లేవు ప్రతి ఒక్కరు కూడా ఈ తాబేలు ఉంగరాన్ని ధరించవచ్చు. అయితే ఈ ఉంగరం ధరించేటప్పుడు ఎప్పుడూ కూడా కుడి చేతి మధ్య వేలుకు మాత్రమే ధరించాలి. ఎట్టి పరిస్థితులలో కూడా ఎడమ చేతికి ధరించకూడదు.
Turtle Ring:
ఈ ఉంగరం వెండితో తయారు చేయించుకున్న దానిని మాత్రమే ధరించాలి. ఇలా వెండితో తయారు చేయించుకున్న ఉంగరం ఎంతో శుభప్రదం అయితే ఈ తాబేలు ఉంగరాన్ని ఎప్పుడు కూడా బంగారంతో తయారు చేయించుకున్నది ధరించకూడదు.ఈ నియమాలను పాటిస్తూ ఈ తాబేలు ఉంగరం ధరించడం వల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా తొలగిపోవడమే కాకుండా అష్టైశ్వర్యాలు కలుగుతాయని వాస్తు పండితులు చెబుతున్నారు.