Categories: DevotionalLatestNews

Tirumala VIP Break: శ్రీవారి భక్తులు అలర్ట్..ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

Tirumala VIP Break: కలియుగ దైవం అయిన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రతిరోజు భక్తులు పెద్ద ఎత్తున తిరుమల చేరుకుంటున్నారు. వేసవి సెలవులు పూర్తి అయినప్పటికీ వారాంతం కావడంతో తిరుమల కొండపై భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఈ నేపథ్యంలోనే భక్తుల దర్శనార్థం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు దర్శన విషయాలలో పలుకీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం విఐపి బ్రేక్ దర్శనాలను నిలిపి వేస్తున్నట్టు టీటీడీ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే విఐపి బ్రేక్ దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులు ఇందుకు అనుకూలంగా తిరుమల ప్లాన్ చేసుకోవడం మంచిది.

తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో సామాన్యులకు స్వామివారి దర్శనం ఎక్కువగా కల్పించాలని ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే సోమవారం నిర్వహించే వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు ఆ రోజు శ్రీవాణి దర్శన టికెట్ల జారీని కూడా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు అనుగుణంగానే భక్తులు వారి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా ఆదివారం వీఐపీ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలను కూడా స్వీకరించబోమని స్పష్టం చేసింది.

TTD cancels Monday vip break darshan due to huge rush in tirumala know details

Tirumala VIP Break: శ్రీవాణి దర్శన టికెట్లు రద్దు..

ప్రతి రోజు ఆన్లైన్ కరెంట్ బుకింగ్ ద్వారా జారీ చేసే 800 శ్రీవాణి దర్శన టికెట్లను సోమవారం జారీ చేయబోమని వెల్లడించింది. ఇలా విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేయడం వల్ల సామాన్యులకు స్వామివారి దర్శనం మరింత వేగంగా కల్పించే అవకాశం ఉంటుంది. ఇక తిరుమలలో రద్దీ విషయానికి వస్తే ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి.బయట ఏర్పాటు చేసిన క్యూలైన్లు కూడా బాలాజీ నగర్ వరకు విస్తరించాయి. వేలాది మంది భక్తులు ఇప్పటికే శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. ఇలా భక్తుల రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలోనే సోమవారం విఐపి బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

Sravani

Recent Posts

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

2 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

2 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

2 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

3 weeks ago

Lord Shiva: కోరిన కోరికలు తీరడం లేదా.. శివాలయంలో ఈ పరిహారం చేస్తే చాలు!

Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…

3 weeks ago

Climbing Stairs: మెట్లు ఎక్కుతూ అలసిపోతున్నారా? ఫిట్ నెస్ లోపం అనుకుంటే పొరపాటే?

Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…

3 weeks ago

This website uses cookies.