Retro Walk: ఇటీవల కాలంలో మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ వాకింగ్ చేయడం అనేది సర్వసాధారణం అయింది. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం వాకింగ్ చేయడం వల్ల మన శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవడమే కాకుండా ఎంతో ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండడానికి కారణం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇక వాకింగ్ చేసే సమయంలో మనం ముందుకు నడుస్తూ వెళ్తుంటాం కానీ వాకింగ్ చేసేటప్పుడు వెనక్కి నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం అందరూ షాక్ అవుతారు.. మరి వెనక్కి నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? అనే విషయానికి వస్తే..
వైద్య పరిభాషలో వెనక్కి నడవడాన్ని రెట్రో వాక్ అంటారు. ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ నడుపునొప్పి, కీళ్ల నొప్పులు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అదేవిధంగా చిన్న వయసులోనే ఊబకాయం రావడంతో అధిక శరీర బరువు పెరిగిపోతున్నారు. ఈ సమస్యలన్నింటికీ రెట్రో వాక్ ద్వారా చెక్ పెట్టవచ్చు. ప్రతిరోజు ఒక పది నిమిషాల పాటు వెనక్కి నడవడం వల్ల శారీరక శ్రమ కాళ్ల కండరాల బలాన్ని గణనీయంగా పెంచుతుంది. శారీరక దృఢత్వంతో పాటు మానసిక సమతుల్యతను పెంపొందించడంలో, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
అధిక శరీర బరువుతో బాధపడేవారు బరువు తగ్గడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలా బరువు తగ్గాలనుకునే వారు రెట్రో వాక్ చేయటం వల్ల 40 శాతం ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. క్యాలరీలు వేగంగా కరగడం వల్ల శరీర బరువు త్వరగా తగ్గుతారు. కనుక రోజువారి శరీర వ్యాయామాలలో భాగంగా వాకింగ్ చేసేటప్పుడు ముందుకు కాకుండా వెనక్కి నడవడం వల్ల ఈ ప్రయోజనాలను మీ సొంతం చేసుకోవచ్చు. ఇలా వెనక్కి నడవడం వల్ల శరీర బరువు తగ్గడమే కాకుండా నడుము నొప్పి కీళ్ళ నొప్పులు వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.