Categories: DevotionalLatestNews

Shani Trayodashi 2026: నేడే శని త్రయోదశి..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు!

Shani Trayodashi 2026: మన హిందు సాంప్రదాయాలలో అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించే వాటిలో శని త్రయోదశి కూడా ఒకటి. శని దేవుడు అనుగ్రహం కోసం పూజించేవారు శని త్రయోదశి రోజున శనీశ్వరుడిని పూజించడం వల్ల శని అనుగ్రహం కలిగి శని దోషాలు తొలగిపోతాయని భావిస్తారు. అయితే ఈ శని త్రయోదశి శనివారం వస్తే కనుక మరింత మంచి ఫలితాలు ఉంటాయి. నేడు(జూన్ 27) శనివారం త్రయోదశి రావడంతో శనీశ్వరుడికి ఎంతో కీలకమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈరోజు శనీశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల శని అనుగ్రహం కలుగుతుంది. అయితే తెలిసి తెలియక శని త్రయోదశి రోజు ఈ పొరపాటు చేస్తే శని ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది.

శని బాధలు ,ఏలినాటి శని బాధలతో బాధపడేవారికి ఈ రోజు చేసే పూజలు, పరిహారాలు అపారమైన ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు.ఈ రోజున శని ప్రభావం ఎక్కువగా ఉన్న వారు అంటే, అష్టమ శని, అర్ధాష్టమని శని, ఏలినాటి శని కాలం నడుస్తున్న వారు శనికి తైలాభిషేకం చేయడం, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం చేస్తుంటారు. అయితే ఈ రోజున పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు. శని త్రయోదశి రోజున పొరపాటున కూడా ఇనుము, ఇనుప వస్తువులను కూడా కొనుగోలు చేయకూడదు. అలాగే నేడు పొరపాటున కూడా నూనె కొనుగోలు చేయకూడదు. ఇలా చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా కలుగుతాయి.

Don’t make these mistakes on shani trayodashi know details

Shani Trayodashi 2026: రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపారాధన..

నేడు శని ఆలయానికి వెళ్ళినప్పుడు నేరుగా శని దేవుడి వైపు చూస్తూ నమస్కరించకూడదు. దానికి బదులుగా శని దేవుడు పాదాల వైపు చూస్తూ నమస్కరించడం వల్ల శుభం కలుగుతుంది . ఇక శని త్రయోదశి రోజు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. పొరపాటున కూడా మందు, మాంసం, గుడ్లు వంటి వాటికి దూరంగా ఉండాలి. నేడు పొరపాటున కూడా నలుపు రంగు వస్తువులను కొనుగోలు చేయకూడదు అలాగే పేదలకు దానధర్మాలు చేయడం వల్ల శని దేవుడి అనుగ్రహం కలుగుతుంది. ఇక శని త్రయోదశి రోజు సాయంత్రం ఇంటి ప్రధాన గుమ్మం పడమర వైపు చీకటి లేకుండా దీపం వెలిగించడం మంచిది. ఇక నేడు సాయంత్రం రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపారాధన చేసి ‘ఓం షణ్ శనైశ్చరాయ నమ:’అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయటం వల్ల శని అనుగ్రహం కలుగుతుంది.

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 month ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.